అక్టోబర్ 31 నుండి వీరికి అఖండ ధనయోగం జంటగా వరమిచ్చిన శని, బృహస్పతి

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రస్తుతం బృహస్పతి, శని గ్రహాలు తిరోగమనంలో సంచరిస్తున్నాయి. బృహస్పతి, శని తిరోగమన సంచారం కారణంగా అత్యంత ప్రత్యేకమైన దీపయోగం ఏర్పడుతుంది .ఈ దీపయోగం కారణంగా దీపావళి నుండి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. దీపావళి పండుగ నాడు బృహస్పతి, శని ఇద్దరు తిరోగమనంలో ఉంటారు. దీపావళి పండుగనాడు ఈ దీపయోగం ముఖ్యంగా మూడు రాశులవారి జీవితంలో సంపదలను శ్రేయస్సును ఇస్తుంది.

తిరోగమనంలో శని, బృహస్పతి ఏర్పరిచే దీప యోగం
రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం, సంవత్సరానికి ఒకసారి బృహస్పతి రాశిని మార్చి సంచారం చేస్తారు. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చేస్తున్నాడు. బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన సంచారంలో ఉన్నాడు. ముఖ్య గ్రహాల తిరోగమన సంచారం దీప యోగం ఏర్పరిచి దీపావళి నుండి మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.

saturn and jupiter creating deepa yoga blessed these zodiac signs with wealth

వృషభ రాశి
బృహస్పతి, శని గ్రహాల తిరోగమన సంచారం కారణంగా దీపావళి నుండి వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి వచ్చే సమస్యలు తొలగిపోతాయి. వివిధ మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి
గురు, శని గ్రహాలు తిరోగమన సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు అన్ని సందర్భాలలో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మెరుగుదలకు అవకాశం ఉంటుంది. పనికి తగిన ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

కుంభరాశి
శని, బృహస్పతి గ్రహాల తిరోగమన సంచారం కారణంగా ఏర్పడే దీపయోగంతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖర్చులు తగ్గుతాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది కుంభ రాశి వారికి అదృష్ట కాలం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+