త్రికాదశ యోగంతో శని, బుధులు కురిపిస్తున్నారు వీరికి కాసుల వర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి . ఇలా గ్రహాలు ద్వాదశ రాశుల వారిని ప్రభావితం చేస్తాయి. గ్రహాలు కొన్ని రాశులపైన ప్రతికూల, కొన్ని రాశుల పైన సానుకూల ప్రభావాలను చూపిస్తాయి. ఇక ఫిబ్రవరి మాసం రాబోతోంది. ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.
బుధ శని గ్రహాల కలయికతో త్రికాదశ యోగం
ప్రధాన గ్రహాలు తమ రాశులను మాత్రమే కాదు నక్షత్రాలను కూడా మార్చుకుంటున్నాయి. అనేక శుభయాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి నెలలో రెండు ప్రధాన గ్రహాలు బుధుడు, శని సంయోగం జరపబోతున్నాయి. శని ఇప్పటికే కుంభ రాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 11న శని ఉన్న కుంభరాశిలోకి బుధుడు కూడా ప్రవేశిస్తాడు. బుధ శని గ్రహాల కలయిక త్రికాదశ యోగాన్ని ఏర్పరచబోతుంది.

మేష రాశి
బుధుడు మరియు శని కలయిక మేష రాశిపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మేషరాశిలో 11వ ఇంట్లో బుధ, శని గ్రహాల కలయిక జరగడం వల్ల మేషరాశి జాతకుల ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంటుంది.
మిధున రాశి
బుధ, శని గ్రహాల కలయిక మిధున రాశి పై సానుకుల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సంయోగం మిధున రాశిలో తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో మిధున రాశి వారి పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తవుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
బుధ శని గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారిపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో మంచి ఉద్యోగాలను పొందుతారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమై మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సమయం ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది
కుంభరాశి
బుధ మరియు శని గ్రహాల కలయిక కుంభ రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకుల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కుంభ రాశి వారికి నూతన ఆదాయ వనరులు ఈ సమయంలో కనిపిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications