2025 ఆరంభంలోనే వీరికి దరిద్రాన్ని దానమిచ్చిన శని, శుక్రులు!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాయి. ఈనెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. అలాగే కుంభ రాశిలో ఉన్న శనితో సంయోగం చెందడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తే కొన్ని రాశుల వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. 2025సంవత్సర ప్రారంభంలోనే ఆర్థిక నష్టాలను, కష్టాలను అనుభవించే ఆ రాశులు ఏమిటి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఎనిమిదో గృహంలో శుక్ర శని గ్రహాల కలయిక జరగడం వల్ల ఇబ్బందులు పడతారు. వ్యసనాలకు బానిసలు అవుతారు. అనవసరమైన పరిచయాలు వీరిని కష్టాల్లోకి నెడతాయి. అక్రమ సంబంధాలతో మనోవేదన అనుభవించాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో గొడవలు అవుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

Saturn and Venus gives poverty on these zodiac signs at the beginning of 2025

సింహరాశి
సింహ రాశి వారికి సప్తమస్థానంలో శుక్ర శని గ్రహాలు యుతి జరగడం వల్ల మీరు విలాసాలకు పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్దిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఈ సమయంలో నష్టపోతారు. అనవసరమైన పరిచయాలు, వ్యసనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వివాదాలలో తలదూరిస్తే ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి.

కన్యారాశి
కన్యరాశిలో శనీశ్వరుడు ఆరో గృహంలో సంచరించడం వల్ల, అదే సమయంలో శుక్రుడుతో కలవడం వల్ల కన్యా రాశి వారికి ఊహించని సమస్యలు వస్తాయి. బంధుమిత్రులతోను జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక నిర్వహణ తప్పుదారి పడుతుంది. ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి మూడవ గ్రహంలో శని సంచరించడంతోపాటు అక్కడే శనితో శుక్రుడు చేరడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. విలాసాలకు చెడు అలవాట్లకు బానిసలై డబ్బు ఎక్కువగా ఖర్చు చేసి ఇబ్బంది పడతారు. వర్తక వ్యాపారాలు దెబ్బతింటాయి. స్నేహితుల కారణంగా నష్టపోతారు. వివాదాలలో ప్రతికూలమైన నిర్ణయాలు వస్తాయి.

మీనరాశి
మీన రాశి వారికి వ్యయ స్థానంలో శుక్ర శని గ్రహాల సంయోగం జరగడం వల్ల విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. దాంపత్య జీవితం లో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుంది. సహాయం తీసుకున్న వారు ప్రస్తుతం సహాయం చేయడానికి కూడా వెనకాడతారు. ఇది మీన రాశి వారికి దరిద్రాన్ని తెచ్చిపెట్టే కాలం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+