ఈ నక్షత్రాలలో పుట్టినవారిని సంపదలతో ముంచెత్తనున్న శని, శుక్రులు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారానికి ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు తమ రాశులను తమ నక్షత్రాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగుతాయి. వీటి ఫలితంగా వివిధ రాశుల వారి జాతకాలు కూడా మారుతూ ఉంటాయి. నవగ్రహాలలో శుక్ర గ్రహానికి, శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా కాదు. ప్రస్తుతం కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. అయితే కుంభరాశిలో శని శుక్రుడి సంయోగం కారణంగా కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి శుభం చేకూరుతుంది.
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి శుక్ర శని గ్రహాలు కలయిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. విదేశాలలో ఉన్న వారికి సొంత ఊర్లో నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. శుక్ర శని గ్రహాల కలయిక కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది.

రోహిణి నక్షత్రం
శుక్ర శని గ్రహాల కలయిక రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇస్తుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సమయంలో దాంపత్యంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఇల్లు సుఖమయం అవుతుంది. ఇది ప్రేమికులకు మంచి సమయం. ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతం అవుతాయి.
ఉత్తర నక్షత్రం
శుక్ర శని గ్రహాల సంచారం ఉత్తర నక్షత్ర జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయం తథ్యంగా కనబడుతుంది. ఈ సమయంలో ఉత్తర నక్షత్ర జాతకుల ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి.
చిత్తా నక్షత్రం
చిత్తా నక్షత్ర జాతకులకు శుక్ర, శని గ్రహాల కలయిక గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. వీరి కుటుంబంలో సుఖ సంతోషాలకు కారణమవుతుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది.
వ్యూహ నక్షత్రం
శుక్ర శని సంయోగం వల్ల వ్యూహ నక్షత్ర జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. వివిధ పోటీలలో పాల్గొనే వ్యక్తులు ఈ సమయంలో రాణిస్తారు. ఇదే సమయంలో విజయాలతో వ్యూహా నక్షత్ర జాతకులు ముందుకు సాగుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications