దసరా నవరాత్రుల నుండి వీరికి అఖండ ధనయోగం ప్రకటించిన శని
న్యాయదేవుడు, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడు ఆయన శని త్వరలో రాహువుకు చెందిన నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ నెలలో శని సరిగ్గా సూర్యగ్రహణం రోజున రాహువు కు చెందిన నక్షత్రంలోకి సంచరించబోతున్నాడు. శని రాహువు కి చెందిన శతభిషా నక్షత్రం లోకి అక్టోబర్ మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు.
శతభిష నక్షత్రంలో శని
ఇక శతభిషా నక్షత్రంలోనే 88 రోజులపాటు శని ఉంటాడు. రాహువు నక్షత్రం లోకి శనిసంచారం అనేక రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. శని కటాక్షంతో కొన్ని రాశుల వారు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
దేవీ శరన్నవరాత్రుల సమయంలో శతభిషా నక్షత్రం లోకి శని సంచారం కారణంగా మేష రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది . మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్ధికంగా లాభపడతారు. డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు శుభవార్తలు వింటారు. అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు.
మిధున రాశి
దేవీ శరన్నవరాత్రుల సమయంలో తొలినాడే శతభిషా నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా మిధున రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏవైనా కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. మిధునరాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అన్ని విధాలుగా మిధున రాశి వారికి ఈ సమయం శుభ సమయం. ఇప్పుడు ఏ పని చేసినా మీకు అదృష్టం కలిసి వస్తుంది.
సింహరాశి
నవరాత్రుల తొలినాడు శతభిషా నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు. సింహరాశి జాతకులకు ఇప్పుడు ఆర్ధికంగా కలిసొస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాలం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏ పని చేసిన ఇప్పుడు విజయాన్ని సాధిస్తారు. ఇది వీరికి మంచి సమయం.
కన్యారాశి
శతభిష నక్షత్రంలోకి శనిసంచారం నవరాత్రుల తొలినాడు జరుగుతుంది. దీని కారణంగా కన్యారాశి వారికి కలిసొస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకం.
తుల రాశి
నవరాత్రుల తొలినాడు శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా తులా రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో తమపై ఉన్న ఉన్నత ఉద్యోగుల నుండి మన్ననలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో కష్టపడి చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి
దేవీ శరన్నవరాత్రుల సమయంలో మకర రాశి జాతకులకు శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా లబ్ది జరుగుతుంది. మకర రాశి జాతకులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఈసమయంలో డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభరాశి
శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా దేవీ శరన్నవరాత్రుల సమయంలో కుంభరాశి జాతకులకు కలిసొస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి డబ్బుకు లోటుండదు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications