అక్టోబర్ లో వీరికి సంపదలతో పాటు యశస్సును ప్రకటించిన శని!
న్యాయదేవుడు, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడు ఆయన శని త్వరలో రాహువుకు చెందిన నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ నెలలో శని సరిగ్గా సూర్యగ్రహణం రోజున రాహువు కు చెందిన నక్షత్రంలోకి సంచరించబోతున్నాడు. శని రాహువు కి చెందిన శతభిషా నక్షత్రం లోకి అక్టోబర్ మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు.
శతభిష నక్షత్రంలో శని
ఇక శతభిషా నక్షత్రంలోనే 88 రోజులపాటు శని ఉంటాడు. రాహువు నక్షత్రం లోకి శనిసంచారం అనేక రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. శని కటాక్షంతో కొన్ని రాశుల వారు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
శతభిషా నక్షత్రం లోకి శని సంచారం కారణంగా మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. డబ్బు సంపాదించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ సమయంలో మేషరాశి జాతకులు శుభవార్తలు వింటారు.
మిధున రాశి
శతభిషా నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా మిధున రాశి వారికి కలిసొస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏవైనా నూతన పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఇప్పుడు ఏ పని చేసినా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మిధున రాశి వారికి ఈ సమయం శుభ సమయం.
సింహరాశి
శతభిషా నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా సింహరాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి జాతకులు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏ పని చేసిన ఇప్పుడు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాలం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.
కన్యారాశి
శతభిష నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా కన్యారాశి వారికి కలిసొస్తుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయం అన్ని విధాలుగా శుభప్రదం.
తుల రాశి
శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా తులా రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో తమపై ఉన్న ఉన్నత ఉద్యోగుల నుండి మన్ననలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో కష్టపడి చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి జాతకులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
కుంభరాశి
శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా కుంభరాశి జాతకులకు కలిసొస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయం అదృష్ట సమయం. కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా శని దయతో అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలం. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి డబ్బుకు లోటుండదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications