saturn blessed zodiac signs: శనిదేవుడు అనుగ్రహించిన అదృష్టరాశులు ఇవే!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనాన్ని బట్టి ద్వాదశ రాశుల వారి జాతకాలు ఉంటాయి. ఇక ఒక్కొక్క గ్రహం కొన్ని రాశుల వారికి అనుకూలంగాను, కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటాయి. సూర్యుడు మొదలుగా గల తొమ్మిది గ్రహాలు వివిధ రాశులపై తమ అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి. గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శని అనుగ్రహం ఏ రాశుల వారిపై ఉంటుంది అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
శని క్రమశిక్షణను, బాధ్యతను నేర్పే గ్రహం. సహనాన్ని నేర్పే గ్రహం. సాధారణంగా శనిని చెడు చేసే గ్రహంగా భావిస్తారు కానీ, శని దశలో చాలామంది ధన లాభాన్ని, సంపద వృద్ధిని చూస్తారు. విద్యా విషయాలలో కూడా శని ముందుకు నడిపిస్తాడు. ఇతరుల నుండి గౌరవ మర్యాదలను పొందేలా శని దేవుడు చేస్తాడు. అటువంటి శని దేవుడి కృప మూడు రాశుల వారిపై పుష్కలంగా ఉంటుంది.

తులారాశి వారికి శనిదేవుడు అనుకూలంగా ఉంటాడు. తులారాశి వారిని ఎప్పుడు శనిదేవుడు మంచి ఫలితాలతో ఆశీర్వదిస్తాడు. శని దేవుడి దయ వారి అన్ని ప్రయత్నాలను ఫలించేలా చేస్తుంది. తులారాశి వారు కష్టపడి పనిచేసేవారిగాను, నిజాయితీపరులుగాను, శ్రద్ధ కలిగిన వారుగాను, దయగల వారిగాను ఉంటారు. తులారాశి వారు శని ఆశీర్వాదంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతే కాదు వారి జీవితంలో శ్రేయస్సు, సంతోషం శనిదేవుడి దయ వల్ల ఎప్పటికీ ఉంటుంది.
కుంభ రాశి వారిపై శని దేవుడు తన అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ చూపిస్తారు. శని దేవుడి దయ వల్ల కుంభ రాశి వారిలో స్వాభావికంగా సద్గుణం, నీతి, నిజాయితీ, సహనం ఉంటాయి. వీరు చాలా అరుదుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. శని దేవుడి దయతో వారు అన్నింటా విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. వీరిపై శని దేవుడు దుష్ప్రభావం చాలా స్వల్ప కాలికంగా ఉంటుంది.
శని దేవుడు దయ మకర రాశి వారిపై ఎప్పటికీ ఉంటుంది. మకరరాశికి అధిపతి శని దేవుడు కాబట్టి మకర రాశి వారు నిరంతరం శని దేవుడి కటాక్షాన్ని పొందుతారు. ఇప్పుడు శని దయవల్ల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వారు ఏ పని చేసిన ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుంది.
మకర రాశి జాతకులు శని దేవుడు దయవల్ల మంచి పట్టుదలతో ముందుకు నడిచే స్వభావం ఉన్నవారిగా ఉంటారు. వారి పైన శని దేవుడి ప్రతికూల ప్రభావం చాలా అరుదుగా ఉంటుంది. మొత్తంగా ఈ మూడు రాశులపై శని దేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications