దీపావళి తర్వాత ఈ రాశులవారికి కుబేర యోగం, ధనలక్ష్మీ కటాక్షం!

వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శని గ్రహం నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. ఒక రాశి నుంచి మరొక రాశికి శని సంచారం చేయడానికి దాదాపు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. 2023లో శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించింది.

కుంభరాశిలో శని సంచారం
శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనములో సంచరిస్తున్న శని నవంబర్ 15 సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకు కుంభరాశిలో ప్రత్యక్షమవుతాడు . కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా దీపావళి తర్వాత వివిధ రాశుల వారికి శుభ ప్రదంగా ఉంటుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

saturn direct in aquarius After Diwali this will gives wealth and kubera blessings to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పనిలో శుభవార్తలు వింటారు .దీపావళి తర్వాత వృషభ రాశి వారికి బోలెడు లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారి భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది.

మిధున రాశి
శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. శని అనుగ్రహం కారణంగా మిధున రాశి వారికి విశేషమైన లాభాలు వస్తాయి. గతంలో ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో సులభంగా పరిష్కారం అవుతాయి.

కుంభరాశి
శని ప్రత్యక్ష సంచారం కుంభ రాశి వారికి మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుంభ రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది

మీనరాశి
మీన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఇది మీన రాశి వారికి నిజంగా అదృష్టాన్ని ఇచ్చే సమయం. ఈ సమయంలో మీన రాశి జాతకులు ఉద్యోగంలోనూ పురోగతిని సాధిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+