శని ప్రత్యక్ష గమనం.. ఈ రాశులవారికి సంపదవర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల పైన సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. అయితే నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహమైన శని కారణంగా కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను, కొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతున్నారు.
కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం
ప్రస్తుతం కుంభ రాశిలో శని సంచరిస్తున్నాడు. కుంభరాశిలో జూన్ 31 తేదీ నుండి శని తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఆపై ఐదు నెలల తర్వాత శని కుంభ రాశిలో ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. నవంబర్ 15వ తేదీన శని రాత్రి 7.51 నిమిషాలకు నేరుగా కుంభరాశిలో సంచరించనున్నాడు. ఇక శని ప్రత్యక్ష సంచారం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి మెరుగైన ఫలితాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో సంపన్నులు అవుతారు.

వృషభరాశి
కుంభరాశిలో శని ప్రత్యక్షంగా ఉండడం వల్ల వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సామాజికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. మానసికఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చేసిన ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి.
మిధున రాశి
కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిధున రాశి వారికి మేలు జరుగుతుంది. మిధున రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. అన్ని విధాలుగా ఈ సమయంలో పురోగమిస్తారు.
కుంభరాశి
కుంభ రాశిలో శని ప్రత్యక్ష సంచారం కుంభరాశి వారి జీవితాలలో అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. లాభాలు వస్తాయి. కెరీర్ లో కొత్త విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తి విషయాల్లో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఊహించని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications