ప్రత్యక్షంగా మారుతూ.. త్వరలో వీరికి ఐశ్వర్యాన్ని, రాజభోగాలను ప్రకటించిన శని!
వేద జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఈ సమయంలో శని తిరోగమనం నుండి ప్రత్యక్షంగా కదులుతాడు. శని దేవుడు జూన్ 2024లో కుంభరాశిలో తిరుగమనం చెందాడు. దీపావళి తర్వాత మళ్లీ ప్రత్యక్ష స్థితిలోకి వస్తాడు.
శని ప్రత్యక్ష సంచారం
2024 నవంబర్ 15వ తేదీన శని దేవుడు 5 గంటల 9 నిమిషాలకు కుంభరాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్షంగా మారనున్నాడు. ఈ మార్పు అన్ని రాశుల వారి జీవితాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శని ప్రత్యక్ష గమనం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశులకు విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
శని ప్రత్యక్ష సంచారం మిధున రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వీరు జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధిస్తారు. మిధున రాశి జాతకులు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. పనిచేసే చోట నూతన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించవలసి వస్తుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి కాలం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శని ప్రత్యక్షంగా మారడం అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వృశ్చికరాశి వారు ఆర్థికంగా బలపడతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వారి అనుబంధం దృఢంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన కాలం. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఇప్పటివరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి.
మకర రాశి
మకర రాశి జాతకులకు శని ప్రత్యక్షంగా మారడం శుభాలను చేకూరుస్తుంది. మకర రాశి జాతకులు తమ ప్రయత్నాలలో విజయాలను పొందుతారు. శని ప్రత్యక్ష సంచారం వల్ల మకర రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వీరి ఆర్థిక స్థితి బలపడుతుంది. శత్రువులపై ఈ సమయంలో మకర రాశి జాతకులు విజయం సాధిస్తారు.
కన్యా రాశి
కన్యారాశి శని ప్రత్యక్షంగా మారడం వల్ల కన్యారాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి. మకర రాశి వారి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. ఆస్తుల ద్వారా సంపద కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. స్నేహితుల పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో సానుకూల ప్రయోజనాలను పొందుతారు.
సింహరాశి
శని ప్రత్యక్షంగా మారడం వల్ల సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహ రాశి వారి సంపద ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. సింహ రాశి వారు తల్లి నుండి డబ్బును సంపాదిస్తారు. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయ స్థాయిలలో గణనీయమైన మార్పు వస్తుంది. సింహ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సింహ రాశి వారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. వాహన సౌఖ్యం లభించే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications