జులై నుండి వీరికి డబ్బుల మూటలు సిద్ధం చేస్తున్న శని!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనిదేవుడిని క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. కర్మలకు అధిపతి అయిన శని దేవుడు, మన కర్మ ఫలాలను అందిస్తాడు. అటువంటి శని దేవుడు మరో మూడు నెలల్లో తిరోగమనం చెందుతాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని దేవుడు జూలై 13 వ తేదీన మీనరాశిలో తిరోగమనం చెందుతాడు.
శని తిరోగమన సంచారం
మీన రాశిలో శని దేవుడు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఏ పని చేసినా విజయలక్ష్మి వెన్నంటే ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కన్యారాశి
మీన రాశిలో శని గ్రహ తిరోగమన సంచారం వల్ల కన్యారాశి వారి పైన శని అనుగ్రహం ఉంటుంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. కన్యారాశి జాతకులు ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. శని తిరోగమనం వీరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మకర రాశి
మకర రాశి జాతకులకు శని తిరోగమన సంచారం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు ఆర్థికంగా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది.. ఇది మకర రాశి వారికి శుభాలను చేకూర్చే సమయం.
మీనరాశి
మీన రాశి జాతకులకు శని తిరోగమన సంచారం లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీన రాశి వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విజయాలు సాధించే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications