కుంభరాశిలో శని తిరోగమనం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం, ఊహించని అదృష్టం
వేద జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. శని గ్రహాన్ని న్యాయ దేవుడిగా చూస్తారు. శనిగ్రహం అన్ని గ్రహాలలోనూ చాలా నిదానంగా కదిలే గ్రహం. శని ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి చాలా సంవత్సరాల కాలం పడుతుంది. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలో శని తన రాశిని మార్చుకుంటుంది. ఇది కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది.
శని తిరోగమనంతో మూడు రాశులవారికి లబ్ది
అయితే జూన్ 29వ తేదీన శని రాత్రి 11 గంటల 41 నిమిషాలకు కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. ఇక శని గమన మార్పు నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. శని తిరోగమనం ముఖ్యంగా మూడు రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను, ఆకస్మిక ధన లాభాలను పొందుతారు.

మేషరాశి
మేష రాశి జాతకులకు శని తిరోగమనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకుల వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా మేష రాశి జాతకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ను, ఆనందదాయకంగా ను ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు.
వృషభరాశి
శని తిరోగమనం వల్ల వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. జీవితంలో ఉన్న ఇతర సమస్యలు, అడ్డంకులు ఈ సమయంలో పరిష్కరించ బడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది. వృషభ రాశి జాతకులకు శని తిరోగమనం అదృష్టాన్ని ఇస్తుంది.
వృశ్చిక రాశి
శని తిరోగమనం వల్ల వృశ్చిక రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి.ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ లోను పురోగతి కనిపిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications