జూన్ 29వ తేదీన శని తిరోగమనం.. 139 రోజులు మూడు రాశులవారు పట్టిందల్లా బంగారం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ద్వాదశ రాశుల వారి జాతకాలలోనూ ప్రభావం చూపిస్తాడు. శనిని న్యాయదేవతగా క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు అటువంటి శని కొన్ని రాశులకు మంచి ఫలితాలను కొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని త్వరలో కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు.
కుంభరాశిలో శని తిరోగమనం
జూన్ 29వ తేదీన శని కుంభరాశిలో తిరోగమనం చేసి నవంబర్ 15వ తేదీ వరకు తిరోగమన స్థితిలోనే ఉంటాడు. ఇక కుంభ రాశిలో శని తిరోగమన కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా 139 రోజులపాటు మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
శని తిరోగమన కాలం మేషరాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా వీరికి ప్రయోజనాలు కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టుబడిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలలోనూ గొప్ప విజయాలను సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు శని తిరోగమనం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకుల వర్తక, వ్యాపారాలు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితం గడుపుతారు. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. నూతన ఆర్థిక వనరులు కనిపిస్తాయి. పనిచేసే చోట సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుంభ రాశి వారికి శని తిరోగమనం అదృష్టాన్ని తీసుకువస్తుంది.
మకర రాశి
శని తిరోగమనం కారణంగా మకర రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. డబ్బు ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది..
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications