ఫిబ్రవరిలో ఈ రాశులవారికి చుక్కలే.. వదల బొమ్మాలీ అంటూ శని అస్తమయం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ఉన్నంత ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జ్యోతిష శాస్త్రంలో శని కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. శని మన మంచి చెడు పనుల ఫలితాలను ఇస్తాడు. ఫిబ్రవరి 28వ తేదీన శని అస్తమయం జరుగుతుంది. శని అస్తమయం కారణంగా శని యొక్క శక్తి తగ్గుతుంది.

శని అస్తమయం.. ఈ రాశులకు కష్టాలు
శని ఫిబ్రవరి 28వ తేదీన అస్తమించి ఏప్రిల్ ఆరవ తేదీన ఉదయిస్తాడు. ఇక ఈ మధ్యలోనే శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు 40 రోజులపాటు శని అస్తమయం కొనసాగుతుంది. అయితే శని అస్తమయం కారణంగా కొన్ని రాశులకు శుభ ఫలితాలు వస్తుండగా మరికొన్ని రాశుల వారు ప్రతికూల ప్రభావాలు చూస్తారు. ఇక శని అస్తమయం కారణంగా ప్రతికూల ప్రభావాలు చూసే ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Saturn setting down in February these zodiac signs will face full of hardships and losses

మేషరాశి
శని అస్తమించడం వల్ల మేష రాశి వారికి కష్టాలు రాబోతున్నాయి. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. కార్యాలయంలో పై అధికారులతో వివాదాలు, విభేదాలు పెరుగుతాయి. ప్రమోషన్ల లో జాప్యం జరుగుతుంది. తలనొప్పి, నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభ రాశి
శని అస్తమించటం కారణంగా వృషభ రాశి వారి కుటుంబ కలహాలు పెరుగుతాయి. వృషభ రాశి జాతకుల ఇంట్లో విభేదాలు, అశాంతి పెరుగుతుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. అప్పులు పెరిగే అవకాశం ఉంది. పనిలో ఆకస్మిక అంతరాయం కలుగుతుంది. కంటికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది.

కర్కాటక రాశి
శని అస్తమయం కర్కాటక రాశి జాతకులకు కష్టాలను తెస్తుంది. కర్కాటక రాశి వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మానసిక అశాంతి పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ నష్టం ఉంటుంది. ఉద్యోగంలో అనిశ్చితి ఎదురవుతుంది. కర్కాటక రాశి వారి ఆరోగ్యం క్షీణిస్తుంది.

సింహరాశి
శని అస్తమయం కారణంగా సింహరాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు వాయిదా పడతాయి. పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. వైవాహిక జీవితంలో తీవ్ర సమస్యలు వస్తాయి.

మకర రాశి
శని అస్తమయం కారణంగా మకర రాశి వారికి వివిధ రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మకర రాశి వారు శని ప్రత్యేక దృష్టి కారణంగా బాధితులుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆర్థిక నష్టాలు చేకూరుతాయి. అనవసరమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+