మార్చిలో శని సంచారంతో పాటు సూర్య గ్రహణంతో నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శని గ్రహం మార్చి నెలలో కుంభరాశిని వదిలి మీనరాశిలోకి సంచారం ప్రారంభిస్తుంది. అదే రోజు సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది. శని గ్రహ సంచారంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడిన ప్రత్యేకమైన రోజున కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
సూర్య గ్రహణం, శని సంచారం ఒకేరోజు
శని మార్చి 29, 2025న రాత్రి 10:07 గంటలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 29నే సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ సంచారంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధునరాశి
శని సంచారం తోపాటు సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి జాతకులకు శుభప్రదమైన రోజులు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో మిధునరాశి వారు గొప్ప ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. మిధున రాశి వారు పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి. పోటీపరీక్షలు రాసే విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది.
ధనస్సు రాశి
2025లో శనిసంచారం మరియు సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారిపైన సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో అసంపూర్ణంగా ఉన్న పనులన్నిటిని పూర్తి చేసుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూల ఫలితాలు పొందుతారు. వివిధ ఒప్పందాల నుండి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామ్యంలో నిమగ్నమైన వారికి మంచి జరుగుతుంది.
మకర రాశి
శనిసంచారం మరియు సూర్యగ్రహణం మకర రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో పూర్వీకులు ఆర్థిక సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లు, ఇంక్రిమెంట్ లు వస్తాయి. సమాజంలో మకర రాశి వారికి పెరుగుతుంది. మతపరమైన అంశాల పైన ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు కొత్త విషయాలను నేర్చుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications