2026లో శనితో ఆకస్మిక ధనలాభం.. ఈ ఇంట కనకవర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో కర్మ దేవుడు, న్యాయ ప్రదాత అయిన శని 2026 సంవత్సరంలో మీన రాశిలో సంచారం చేస్తాడు. శనిదేవుడు జనవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రంలో, ఆ తర్వాత మే 17న రేవతి నక్షత్రంలో, అక్టోబర్ 9న తిరిగి ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు.
శని సంచారం.. అదృష్ట రాశులు
శని దేవుడు మూడు సార్లు నక్షత్ర సంచారం చేస్తూ నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు కూడా వస్తాయి. అయితే మన జాతకంలో వివిధ రాశుల సంచారం పైన కూడా అవి ఆధారపడి ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
శని నక్షత్ర మార్పు వృషభరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. 2026లో మూడుసార్లు శని నక్షత్ర మార్పు జరుగుతున్న కారణంగా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వృషభరాశిలో శని ఆదాయ మరియు లాభ స్థానంలో ఉండడం వలన వృషభరాశి వారు 2026 లో నూతన ఆదాయ వనరులను చూస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీ వంటి వాటిలో ప్రయోజనాలను పొందుతారు. శుభవార్తలు వింటారు.
కుంభరాశి
శని 2026లో మూడుసార్లు నక్షత్రాన్ని మార్పు చేయడం వల్ల కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శనిదేవుడు మీ రాశికి అధిపతి మాత్రమే కాకుండా మీ రాశి నుంచి రెండవ ఇంటికి సంచారం చేస్తున్నాడు. కుంభరాశి వారిపై 2026లో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ శని లాభాలను కూడా చేకూరుస్తాయి. చాలాకాలం అప్పుల్లో ఉన్న మీకు వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.
తులారాశి
2026 లో శని మూడుసార్లు నక్షత్రాన్ని మార్పు చేయడం తులా రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. శని మీ రాశి నుండి 6వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ సమయంలో తులా రాశి వారి ధైర్య సాహసాలు పెరుగుతాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. తులారాశి జాతకులు ఏదైనా క్లిష్ట పరిస్థితిని సులభంగా అధిగమించి విజయ మార్గంలో ముందుకు సాగుతారు. ఇది తులా రాశి వారి జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. గౌరవ మర్యాదలు తెస్తుంది.ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. వ్యాపార రంగంలో పనిచేసే వారి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications