పూర్వాభాద్ర రెండోపాదంలోకి శని సంచారం.. మూడు రాశులకు ధనయోగం
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా విశేషమైన స్థానం ఉంటుంది. శని క్రమశిక్షణకు, సహనానికి మారుపేరు. జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే వ్యక్తి యొక్క అదృష్టం ప్రకాశిస్తుంది. ఏప్రిల్ 6వ తేదీన శని పూర్వభద్ర నక్షత్రం లోని మొదటి పాదంలో ప్రవేశించారు. నేడు పూర్వభద్ర నక్షత్రంలోని రెండవ పాదంలోకి శని ప్రవేశం జరుగుతుంది.
శని నక్షత్ర సంచారం .. మూడు రాశులకు అదృష్టం
పూర్వాభాద్ర రెండో పాదంలోనే శని ఆగస్టు 18వ తేదీ వరకు ఉంటాడు. పూర్వభాద్ర నక్షత్రం రెండవ పాదం లోకి శని సంచారం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి ధనయోగం కలుగుతుంది. వారు ఈ సమయంలో అన్ని విషయాలలోనూ సానుకూల ఫలితాలను చూస్తారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్యా రాశి
శని నక్షత్ర మార్పు వల్ల కన్యారాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు బలోపేతం అవుతాయి. ఊహించని ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి
శని నక్షత్ర మార్పు వల్ల వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి సంపద పెరిగే అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఊపందుకుంటాయి. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారవేత్తలకు శని నక్షత్ర మార్పు వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ధనయోగం ఉంది.
కుంభ రాశి
శని నక్షత్ర మార్పు వల్ల కుంభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు కుటుంబం నుండి లేదా మీ పూర్వీకుల నుండి ఆశీర్వాదాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను ఆర్జిస్తారు. శనీశ్వరుని అనుగ్రహంతో సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఏ పని చెయ్యాలి అనుకున్నా విజయం మిమ్మల్ని వరిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications