Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నక్షత్రం మారుస్తున్న శని; ఏప్రిల్ లో ఈ రాశులవారి జీవితంలో కష్టాలు!!

శనిని న్యాయ దేవుడిగా చెబుతారు. శని క్రమశిక్షణ ఇస్తాడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో శనికి చాలా ప్రభావం ఉంటుంది. అటువంటి శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో శని నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ప్రస్తుతం శతభిషా నక్షత్రంలో ఉన్న శని ఏప్రిల్ 6వ తేదీన పూర్వభద్ర నక్షత్రంలోకి వెళ్తారు.

30 సంవత్సరాల శని ఆ నక్షత్రంలోకి
శని పూర్వభద్ర నక్షత్రం లోకి వెళ్లడం 30 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఊహించని కష్టాలు ఉంటాయి. వీరు అనేకరకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి శని నక్షత్ర మార్పు కారణంగా కష్టాల పాలయ్యే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

saturn transit in purvabhadra Nakshatra Difficulties in for these zodiac signs in april

మేష రాశి
శని నక్షత్రాన్ని మార్చడం వల్ల మేష రాశి వారు కష్టాలను అనుభవించబోతున్నారు. మేష రాశి జాతకుల జీవితాలలో ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి. ఉద్యోగంలోనూ మనశ్శాంతి ఉండదు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. జీవిత భాగస్వామితో విబేధాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు అయితే దారుణంగా ఇబ్బంది పెడతాయి.

మిధున రాశి
శని నక్షత్రాన్ని మార్చడం వల్ల మిధున రాశి జాతకులకు ఏమాత్రం కలిసిరాదు. ఈ పరిణామం మిధున రాశి జాతకులకు అశుభ ఫలితాలను ఇస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే తీవ్రంగా నష్టపోతారు. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

సింహరాశి
శని నక్షత్రాన్ని మార్చడం వల్ల సింహరాశి జాతకులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడే సమయం వస్తోంది. విపరీతమైన ఖర్చులతో సింహరాశి జాతకులు ఇబ్బంది పడతారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుండదని చెప్తున్నారు.

తులారాశి
తులారాశి జాతకులు శని నక్షత్రాన్ని మార్చడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో వీరు అప్పుల బాధలతో సతమతమవుతారు. ఆర్థిక నష్టాలు తులా రాశి వారిని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వీరిని ఈ సమయంలో వేధిస్తాయి. కాబట్టి జాగ్రత్త.

వృశ్చిక రాశి
శని నక్షత్రాన్ని మార్చడం వృశ్చిక రాశి జాతకులకు నష్టాలు కలిగిస్తుంది. ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. పని భారం పెరుగుతుంది. తీవ్ర ఒత్తిడికి లోనై అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతానం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది.

కుంభరాశి
శని నక్షత్రం మార్పు కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కుంభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చుల కారణంగా అప్పులు చేయాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+