బృహస్పతి నక్షత్రంలో సంచరిస్తూ వీరికి కష్టాలు తప్పవన్న శని!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 2024డిసెంబర్ నెలలో శని బృహస్పతి నక్షత్రమైన పూర్వా భాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి సంచారం సాగిస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ఫలితాలు వస్తాయి.
పూర్వాభాద్ర నక్షత్రంలోకి శని
శని క్రమ శిక్షణకు మారు పేరు, కర్మలకు అధిపతి. మన కర్మ ఫలాలను శని మనకు తిరిగి అందిస్తాడు. సహనానికి మారు పేరైన శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయటం వలన కొన్ని రాశులవారు కష్టాలను, నష్టాలను చూస్తారు. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి
శని పూర్వాభాద్ర నక్షత్ర సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారు తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఊహించని ఘర్షణలు, ఉద్రిక్తతలు, అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. కనుక కర్కాటక రాశి వారు జాగ్రత్త.
సింహరాశి
శని పూర్వాభాద్ర నక్షత్ర సంచారం కారణంగా సింహరాశి వారికి కొన్ని సానుకూల ప్రయోజనాలు ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శని ప్రభావంతో సింహరాశి వారికి వచ్చే కష్టాలను ఎదుర్కోవాల్సిన సమయం. ఈ సమయంలో సింహరాశి వారు అప్రమత్తంగా ఉండాలి.
మకరరాశి
శని పూర్వాభాద్ర నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. మకర రాశి వారికి ఈ సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. వృత్తిపరమైన అంశాలలో కూడా తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవటానికి ఈ సమయంలో చాలా ప్రిపేర్ గా ఉండాలి. ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications