పదిరోజుల్లో ఈ రాశులవారింట కాసుల పంట... సెలవిచ్చిన శనిదేవుడు!

ద్వాదశ రాశుల వారి జాతకాల పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించే శక్తివంతమైన దేవుడు శని దేవుడు. చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. శని రాశి సంచారం మాత్రమే కాదు నక్షత్ర సంచారం కూడా అన్ని రాశుల వారి జీవితాలను మారుస్తుంది.

శని నక్షత్ర సంచారం
క్రమశిక్షణకు మారుపేరుగా సహనానికి ప్రతీకగా చెప్పుకునే శని ఏప్రిల్ 28వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు. ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 7 గంటల 52 నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం ప్రారంభమవుతుంది. శని నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. శని నక్షత్ర సంచారం కారణంగా అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Saturn transits in uttarabhadra nakshatra in April luck to these zodiac signs

వృషభ రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచరించే సమయంలో వృషభరాశిలో 11వ ఇంట్లో ఉంటాడు. ఇది వృషభరాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది. వివిధ రకాలుగా వీరికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి శుభఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో అన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.

మిధున రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచరించే సమయంలో మిధున రాశిలో పదవ ఇంట్లో ఉంటాడు. ఇక ఈ సంచారం మిధున రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. వీరికి శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శని అనుగ్రహంతో డబ్బు ఆదా అవుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వీరి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మిధున రాశి జాతకులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేసే వారికి పురోగతి ఉంటుంది. ఇది అన్ని విధాల వీరికి కలిసొచ్చే సమయం.

తులారాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచరించే సమయంలో తులారాశిలో 60 ఇంట్లో ఉంటాడు. దీంతో తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వీరికి లబ్ధి చేకూరుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ఆరోగ్యం ఈ సమయంలో స్థిరంగా ఉంటుంది. ఇది అన్ని విధాల తులా రాశి వారికి శుభ సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+