త్వరలో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులివేనన్న శని

నవగ్రహాలలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. శని గ్రహం కర్మలకు అధిపతిగా చెబుతారు. న్యాయదేవత గా గుర్తింపు ఉన్న శని ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తారు. శని ఉచ్చ స్థితిలో ఉంటే ఆయా జాతకుల జీవితాలు ప్రకాశిస్తాయి. శని నీచ స్థితిలో ఉంటే జాతకులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కష్టాలని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని, సహనాన్ని కూడా శని ఇస్తాడు.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం
శని దేవుడు రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. త్వరలో శని నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. శని దేవుడు ఏప్రిల్ 28వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారాన్ని మొదలు పెడతాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

saturn uttarabhadra nakshatra transit will give wealth to these zodiac signs

వృషభ రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు.. వృషభ రాశిలో పదకొండవ స్థానంలో శని సంచరిస్తాడు. కాబట్టి ఈ సమయం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు ఆస్కారం ఉంది. వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన సమయం. ఉద్యోగాలు చేసే వారికి మన్ననలు వస్తాయి.

మిధున రాశి
శని నక్షత్ర మార్పు మిధున రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో మిధున రాశి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మిధున రాశి వారికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. శని నక్షత్ర మార్పు కారణంగా మిధున రాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు.

తులారాశి
శని నక్షత్ర మార్పు తులారాశి జాతకులకు కలిసి వస్తుంది. తులారాశిలో శని 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీని ఫలితంగా తులా రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. పూర్వీకులకు సంబంధించి ఆస్తులు కలిసి వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. తులా రాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని సంచారం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి సమయం. ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందుతారు. మత సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇది ధనుస్సు రాశి జాతకులకు అదృష్ట సమయం.

మకర రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి శని సంచారం కారణంగా మకర రాశి వారి జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. వీరికి ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. మకర రాశి వారి గౌరవం పెరుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+