నేటినుండి శని సంపదల వర్షంతో ఈ రాశుల దశ తిరగబోతుంది!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. శని గ్రహాన్ని నపుంసక గ్రహంగా చెబుతారు. శని నలుపు, నీలం రంగులను సూచిస్తాడు. మకర, కుంభ రాశులకు అధిపతిగా శని ఉంటాడు. శని దేవుడు తులా రాశిలో ఉచ్ఛస్థితిలో, మేషరాశిలో నీచ స్థితిలోనూ ఉంటాడు. అటువంటి శని దేవుడు తిరోగమన సంచారం చేస్తున్నాడు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటల 30నిమిషాల నుండి శని దేవుడు తిరోగమన సంచారాన్ని ప్రారంభిస్తున్నాడు.

శని తిరోగమన సంచారం
మీన రాశిలో శని తిరోగమన సంచారాన్ని ప్రారంభించి మళ్లీ నాలుగు నెలల తర్వాత ప్రత్యక్ష సంచారాన్ని మొదలుపెడతాడు. నవంబర్ 28వ తేదీ వరకు మీన రాశిలో శని తిరోగమన సంచారమే చేస్తాడు. శని తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి శుభాలను, ఊహించని ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

saturn will give these zodiac signs unexpected wealth in retrograde from today

కన్యారాశి
శని తిరోగమన సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. కన్యారాశిలో ఏడవ ఇంట్లో శని తిరోగమనం చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వీరి ప్రేమజీవితం సంతోష దాయకంగా ఉంటుంది. శని తిరోగమన సంచారంతో కన్యారాశి వారు వాహనాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

మకర రాశి
శని తిరోగమన సంచారం మకరరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకరరాశి జాతకులు అన్నిరకాల లబ్ధిని పొందుతారు. మకరరాశిలో మూడవ ఇంట్లో శని తిరోగమనం చేయడం వల్ల వీరికి ఊహించని మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తోడబుట్టిన వారినుండి సహాయం అందుతుంది. కష్టపడి పనిచేసే వారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు. మకరరాశి వారి కమ్యూనికేషన్ ఈ సమయంలో పెరుగుతుంది. ఆర్థికంగా లబ్ది జరుగుతుంది.

మీనరాశి
శని తిరోగమన సంచారం మీనరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసేవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. మీన రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. కాస్త ఓర్పుతో నేర్పుతో పనులు చేసే వారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+