త్వరలో వెండి పాదంతో శని సంచారం.. వీరి జీవితంలో పట్టిందల్లా బంగారం!

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శని 2025వ సంవత్సరంలో మీనరాశిలో సంచరిస్తాడు. మార్చి 29 2025 నాడు శని మీన రాశిలోకి సంచరించటం వల్ల అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. అయితే శని గ్రహం రాశి మార్పుతో పాటు ఈ స్థితిలో రాశిని బట్టి పాదం కూడా మారుస్తుంది.

వెండి పాదంతో నడిచే శని
శని దేవుడు మొత్తం నాలుగు పాదాలతో నడుస్తాడు. బంగారం, వెండి, రాగి మరియు ఇనుప పాదంతో శని దేవుడు నడుస్తాడు. అయితే 2025 సంవత్సరంలో శనిగ్రహం వెండి పాదంతో సంచరించే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో వెండి పాదాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అదేవిధంగా శని వెండి పాదంతో నడిచినప్పుడు కొన్ని రాశులకు సంపద, పురోగతి సాధ్యమవుతుందని చెబుతారు. ప్రస్తుతం అవేమిటో మనం తెలుసుకుందాం.

Saturn will soon transit with a silver foot gives wealth and happiness to these zodiac signs

కర్కాటక రాశి
శని వెండి పాదంతో సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగం చేసే వారికి ఇంక్రిమెంట్లు రావడంతో పాటు ప్రమోషన్లు కూడా వస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. కర్కాటకరాశి వారికి ఈ సమయంలో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ఏ పని చేసినా విజయం వరిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి. సంపదల యోగం కలుగుతుంది. సంతోషంగా జీవిస్తారు.

వృశ్చిక రాశి
శని వెండి పాదంతో సంచారం చేయడం వృశ్చికరాశి జాతకులకు శుభప్రదంగా మారుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు భౌతిక ఆనందాలను పొందుతారు. సంపద బాగా పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది.గౌరవం మరింత పెరుగుతుంది. వృశ్చికరాశి వారు భూములు, భవనాలు మరియు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరు కుటుంబంతో సంతోషంగానే గడుపుతారు.

కుంభరాశి
శని వెండి పాదంతో సంచరించడం కుంభ రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంతోషం మీ సొంతమవుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు శుభవార్తలు వింటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+