వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంగల్య దోషాలు తొలగిపోవాలంటే

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

సంతానం కలగలన్నా..మాంగళ్య దోషం పోవాలన్నా.. అరటిచెట్టుని పూజించాలి..! సీతారాములు కూడా అరటి పూజ చేశారని ప్రతీతి. దేవతలు కొలువుండే వృక్షాలలో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి.

ఇలా చేయండి
ఒక మంచి రోజు చూసుకుని.. ఉదయాన్ని లేచి.. తలస్నానం చేసి.. పెరటిలో ఉన్న అరటి చెట్టు గానీ.. లేక ముందుగా తెచ్చి పెట్టుకున్న అరటి పిలకను గానీ పూజా మందిరంలో ఉంచి పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

Seetharama also performed Banana Puja

సీతారాములు కూడా ..
అరటికాండానికి పసుపు కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అలంకరించి.. దీపారాధన చేయడం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసీదళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. మధ్యాహ్నం పూట ఐదుగురు ముత్తయిదువులకు భోజనం పెట్టి. వారికి దక్షిణ తాంబూలాదులు, ఐదేసి అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి. అరటి పూజను సీతారాములు కూడా చేశారని విశ్వాసం.

ఆర్థిక ఇబ్బందులు ఉండవు
ఈ పూజను చేసినవారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసిస్తారు.

Seetharama also performed Banana Puja

గురువుకు ప్రతీక అరటిచెట్టు
అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవ గురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని.. గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటిచెట్టు మాంగల్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని అనుభవజ్ఞులై పెద్దలు చెప్తున్నారు.
English summary
is in the wrong .. good luck .. worship the banana tree ..! It is known that the Seetharams also performed Banana Puja. Banana tree is also one of the trees that the gods have. Distinguishing the fruits of banana by worshiping the banana tree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X