తప్పించుకోలేరు.. వీరికి కష్టాలను, ధన నష్టాలను ఇస్తానన్న శని!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం అన్ని గ్రహాలలోని శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. శని కదలికలో వచ్చే ప్రతి మార్పు చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్రమైన ప్రభావం పడుతుంది. కుంభరాశిలోనే శని అస్తమిస్తాడు. ఇక శని సంచారం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులను కష్టాలను ఎదుర్కోబోతున్నారు. ఆ రాశులు ఏమిటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభరాశిలో పదవ స్థానంలో శని దేవుడు ఉన్నాడు. వృషభ రాశిలో శనిసంచారం కారణంగా వారు వారి వ్యక్తిగత జీవితాలతో పాటు ఆర్థిక విషయాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగం చేసేచోట కూడా సానుకూల సంబంధాలను కొనసాగించలేరు. పై అధికారులతో సహా ఉద్యోగులతో ఇబ్బందులు పడతారు. పనిలో, వ్యాపారంలో కూడా సానుకూల ఫలితాలు రాకపోవచ్చు. ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోవచ్చు. ఆర్థికంగా అనవసరమైన ఖర్చుల కారణంగా వృషభరాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింహరాశి
సింహరాశిలో ఏడవ స్థానంలో శని అస్తమయం జరుగుతుంది. దీని ప్రభావంతో సింహరాశి జాతకులకు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు కెరీర్ విషయంలో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. విజయం సాధించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు పోటీని ఎదుర్కొంటారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడతారు. పొదుపు అనేది లేకుండా సింహరాశి జాతకులు ఖర్చులలో, కష్టాలలో మునిగిపోతారు.
తులారాశి
తులారాశి వారి అయిదవ ఇంట్లో శని అస్తమించబోతున్నాడు. ఇది తులా రాశి వారి వృత్తి జీవితంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. తులా రాశి వారి భవిష్యత్తు గురించి ఆందోళనను కూడా పెంచుతుంది. ఇక శని కుంభరాశిలో అస్తమించినప్పుడు తులా రాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితం ఉండదు. తులా రాశి వారి ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి .వ్యాపారాల పరంగాను వీరి లాభాలు తగ్గిపోతాయి. తులా రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల ఉండదు. ఆర్థికంగానూ తులా రాశి వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications