శారద పూర్ణిమ లక్ష్మీపూజ నేడే: ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే డబ్బు వర్షం!!

లక్ష్మీదేవి సంతోషంగా ఉంటే జీవితం ఆనందం మరియు సిరిసంపదలతో తులతూగుతుందని చెబుతారు. అటువంటి లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెడితే ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుందని ఏ లోటూ లేకుండా ఉంటుందని చెబుతారు. అయితే అలా ఐశ్వర్యవంతులు కావాలంటే శారద పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈరోజు శారద పూర్ణిమ. ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తితో కలిపి లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతారు.

నేడు ఇంటికి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని పూజిస్తే, ధనలక్ష్మి ఆశీస్సులతో జీవితం సంతోషంగా ఉంటుందని, జీవితంలోను మధురమైన అనుభూతులు మిగులుతాయని చెబుతున్నారు. మరి శారద పూర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. శారద పూర్ణిమ రోజున శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. శంఖం ఉన్నచోట లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. పూజ స్థలంలో తెల్లటి శంఖాన్ని ఉంచి లక్ష్మీపూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

Sharad Purnima Lakshmi Puja today: Money rain if you bring these things at home!!

శారద పౌర్ణమి రోజున గులాబీ పువ్వులు ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజించాలి. గులాబీ పూల అన్న గులాబీ పరిమళం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తల్లికి క్రమం తప్పకుండా గులాబీలతో పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుందని చెబుతారు. శారద పౌర్ణమి నాడు స్పటిక హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. స్పటికాలతో లక్ష్మీదేవి మంత్రాలను జపించి హారానికి లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.

శారద పౌర్ణమి నాడు ఇంట్లో పూజ స్థలంలో విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచి పూజించినట్లయితే కుటుంబానికి ధనానికి లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.లక్ష్మీదేవి పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించడం శ్రేయస్కరమని ఈ దీపం చతుర్భుజం గా ఉంటే మరింత శ్రేయస్కరమని చెబుతున్నారు.

శారద పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పాలు సమర్పించాలని, నైవేద్యంగా అమ్మవారికి మిఠాయిలు సమర్పించాలని చెబుతున్నారు. అలా చేస్తే ఆర్దిక చింతలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి నేడు శారద పౌర్ణమి సందర్భంగా ఇంటికి వస్తువులను తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజించండి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+