శశ రాజయోగం వరమిచ్చింది ఈ రాశులకు ధనలక్ష్మీ కటాక్షం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలలో చాలా ముఖ్యమైన పరిణామాలకు కారణమవుతుందని తెలిసిందే. అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతాయి. శని చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం కావడంతో ఈ సంవత్సరం మొత్తం శని కుంభరాశి లోనే ఉంటున్నాడు.
శశ మహా పురుష రాజయోగం
శని కుంభరాశిలో ఉండడం వల్ల అరుదైన శశ రాజయోగం ఏర్పడి మార్చి 2025 వరకు కొన్ని రాశుల వారికి శని దేవుడు అదృష్టాన్ని ఇస్తున్నాడు. అపారమైన సంపదలను ఇస్తున్నాడు. పంచ మహాపురుష యోగాలను ఒకటైన ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు విశేషమైన ప్రయోజనాలను పొందుతున్నారు. ఇక ఆ రాశుల విషయానికి వస్తే..

వృషభరాశి
శని వృషభ రాశిలో పదవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు బహుముఖాలుగా ప్రయోజనాలు చేకూరుతున్నాయి. వీరికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో అపారమైన సంపదలు వస్తాయి. నూతన గృహాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్ కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది మంచి సమయం .ఈ సమయంలో వృషభ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
తులా రాశి
తులా రాశిలో ఐదవ ఇంట్లో శని సంచారం జరుగుతుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆదాయపరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది సరైన సమయం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా విజయాలను అందించే సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో మూడవ ఇంట్లో శని ఉంటాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు కచ్చితంగా విజయాలను సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారు ఆఫీసుల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా పని చేసుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయినప్పటికీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.
మకర రాశి
శని మకర రాశిలో రెండవ ఇంట్లో ఉంటాడు. దీంతో మకర రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. విదేశాలకు వెళ్లాలని కలలు కన్న వారికి వారి కోరికలు నెరవేరుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు చాలా సంతోషంగా ఉంటారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి శశ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో భారీ లాభాలను, ఆర్థిక ప్రయోజనాలను చూస్తారు. సమాజంలో కుంభ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు వారు చేసే రంగంలో పురోగతి లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభాలతో ఈ సమయంలో కుంభ రాశి వారిని అదృష్ట లక్ష్మి వరిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications