అరుదైన షోడశ పంచక యోగం... శని సూర్యుల దయతో నక్కతోక తొక్కుతున్న రాశులివే!

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం శని మీన రాశిలోనూ గ్రహాల రాజు అయిన సూర్యుడు వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు తండ్రీకొడుకుల సంబంధాలను కలిగి ఉన్నాయని భావిస్తారు. కానీ శని సూర్యులు శత్రుత్వాన్ని కలిగి ఉంటారు.

అరుదైన షోడశ పంచక యోగం
శని మరియు సూర్యుడు జూన్ 12, 2025న, ఒకరికొకరు 80 డిగ్రీల దూరంలో అరుదైన షోడశ పంచక యోగాన్ని ఏర్పరిచారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల వారు కొన్ని ప్రయోజనాలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటి? ఆ ప్రయోజనాలు ఏమిటి ? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

shodasha panchak yoga effect on these zodiac signs with the grace of saturn and sun

వృషభ రాశి
షోడశ పంచక యోగం వృషభ రాశి వారికి శుభప్రదంగా చెప్పబడింది. శని లాభదాయక గృహంలోనూ సూర్యుడు లగ్న గృహంలోనూ ఉండడం వల్ల ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారి పూర్తి చేయని ప్రాజెక్టులను ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. జీవితంలో అనేక ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

ప్రమోషన్లు, అన్నింటా విజయాలు
జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అంకితభావంతో ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి తిరిగి డబ్బు పొందుతారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి
షోడశ పంచక యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారి అదృష్ట గ్రహంలో శని ఉన్నాడు. లాభగృహంలో సూర్యుడు ఉంటాడు. దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. శని మీ అదృష్టానికి అనుకూలంగా ఉంటాడు . వివిధ ఒప్పందాల నుంచి గొప్ప లాభాలను పొందుతారు.

వ్యాపారాల్లో పెట్టుబడులు, విజయాలు
జీవితంలో శాంతి, స్థిరత్వం ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు ఇప్పుడు నెరవేరుతాయి. వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం వస్తుంది.

తులా రాశి
షోడశ పంచక యోగం కారణంగా తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. తులా రాశిలో సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో, శని 6వ ఇంట్లో ఉండడం వల్ల వివిధ ఒప్పందాల నుండి ఆర్థిక లాభాలు వస్తాయి. తులారాశి వారు మంచి మొత్తంలో సంపదను కూడబెట్టుకుంటారు. వ్యక్తిగత జీవితంలో అదనపు ఖర్చులు తొలగించబడతాయి. నిర్ణీత సమయాల్లో వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పనికి కట్టుబడి ఉంటారు.

తులా రాశి వారికి అదృష్టం
సూర్యభగవానుడి అనుగ్రహంతో తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనేక రంగాలలో విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలలో తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసొస్తుంది. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి లబ్ధి చేకూరుతుంది. తుల రాశి వారికి ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదురు కావు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+