Shravana masam 2022: శ్రావణ మాసంలో చెయ్యాల్సిన, చెయ్యకూడని పనులివే!!

శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివుడిని, లక్ష్మీదేవిని భక్తులు విశేషంగా పూజిస్తారు. ఈ మాసంలో శివారాధన చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయని, భోళా శంకరుడు అయిన శివుడు కటాక్షిస్తాడు అని చెబుతారు. ఇక ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల, మంగళగౌరీ వ్రతాన్ని చేయడం వల్ల ప్రతి ఇల్లు సుఖసౌఖ్యాలతో విలసిల్లుతుంది అని చెబుతారు.

శ్రావణ సోమవారాల్లో ఉపవాసం .. శివుడిని ప్రసన్నం చేసుకునే మార్గం

శ్రావణ సోమవారాల్లో ఉపవాసం .. శివుడిని ప్రసన్నం చేసుకునే మార్గం


శ్రావణమాసంలోని అన్ని రోజులు చాలా సంపన్నమైనవిగా పరిగణించబడతాయి.ఈ నెలలో ప్రతి సోమవారాన్ని శ్రావణ సోమవారంగా పిలుస్తారు మరియు అత్యంత పవిత్రమైనదిగా భావించి భక్తులు దేవాలయాలకు పోటెత్తుతారు. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ మాసం మొత్తం ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

శ్రావణ మాసం ... శివారాధన ఇలా

శ్రావణ మాసం ... శివారాధన ఇలా


శ్రావణ మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి, శివాలయాన్ని దర్శించి, పాలు, నెయ్యి, పెరుగు, గంగాజలం, తేనె కలిపిన పంచామృతాన్ని బిల్వ పత్రాలతో పాటు శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. శివుడిని పూజించడం కోసం పాలు మరియు పాల ఉత్పత్తులు, పండ్లు వంటి వస్తువులు ఆమోదించబడ్డాయి. పంచామృతం, బిల్వ పత్రాలు, గంగాజలం, పూలతో పాటు తేనె లేదా పంచదార మరియు విభూతిని శివునికి సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

భగవంతునిపై అంకిత భావంతో .. శ్రావణ మాస ఉపవాస దీక్ష .

భగవంతునిపై అంకిత భావంతో .. శ్రావణ మాస ఉపవాస దీక్ష .

.
ముఖ్యంగా మంచి భర్తను కోరుకునే పెళ్లికాని స్త్రీలు అన్ని శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేయడం మంచిదని సూచించబడింది. ఇక మంగళ గౌరీ వ్రతాన్ని వివాహిత స్త్రీలు కూడా ఈ మాసంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం చేస్తారు. శ్రావణ మాసంలో శివ మంత్రాన్ని పఠించడం వల్ల శివుడి కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఇక శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తూ సంకల్పాన్ని తీసుకోవాలని, మీ ఉత్తమ సామర్థ్యంతో ఈ వ్రతాన్ని ఆచరించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవాలని సూచించబడింది.

 సోమవారం రెండు సార్లు పూజ చెయ్యటం మంచిది

సోమవారం రెండు సార్లు పూజ చెయ్యటం మంచిది


ప్రతి సోమవారం రెండుసార్లు శివారాధన లేదా పూజ చేయడం మంచిదని సూచించబడింది. ఈ సమయంలో మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు. రుద్రాక్షను ధరించి శివారాధన చేయడం కూడా మంచిని చేకూరుస్తుందని చెబుతున్నారు. ఉపవాసం ఉన్న సమయంలో ఓం నమఃశివాయ అని భగవంతుడిపైనే దృష్టి లగ్నం చేయాలని సూచిస్తున్నారు.

శ్రావణ మాసం చెయ్యకూడని పనులివే

శ్రావణ మాసం చెయ్యకూడని పనులివే


అత్యంత పవిత్ర మాసం అని భావించే శ్రావణమాసంలో ఎవరు మాంసాహారం, మద్యం సేవించవద్దు అని చెబుతున్నారు. అంతేకాదు ఈ నెలలో పురుషులు ఎవరు షేవింగ్ చేయించుకోవద్దని సూచిస్తున్నారు. ఇక నెల రోజుల పాటు ఉపవాసం చేయాలని సంకల్పించిన వారు మీ ఉపవాసాన్ని మధ్యలో విరమించకూడదని చెబుతున్నారు. ఒకసారి ప్రారంభించిన తర్వాత, మధ్యలో ఉపవాసం విరమించడం చాలా అశుభం అని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+