శుక్ర గోచారం : మాలవ్య రాజయోగం; త్వరలో ఈ రాశులవారికి రాజభోగం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రుడు విలాసాలకు సంబంధించిన గ్రహం. శుక్ర సంచారం వల్ల వివిధ రాశుల వారికి విలాసాలు, సౌకర్యాలు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. అయితే భౌతిక సుఖాలకు మూలమైన శుక్రుడు మార్చి 31వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 31 నిమిషాలకు కుంభరాశి నుండి మీన రాశికి వెళుతున్నాడు.

ఈ శుక్ర గోచారం తోపాటు అక్కడ మీనరాశిలో సూర్యుడు మరియు రాహువు మధ్య సంయోగం ఏర్పడడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ మాలవ్య రాజయోగం ముఖ్యంగా ఐదు రాశుల వారికి కీర్తి ప్రతిష్టలను, సంపదను ఇస్తుంది. ప్రస్తుతం మనం ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
శుక్రగోచారం కారణంగా ఏర్పడుతున్న మాలవ్య రాజయోగంతో కర్కాటక రాశి వారికి కలిసొస్తుంది. ఊహించని విధంగా అనేక అవకాశాలు వస్తాయి. కెరీర్ పరంగా బాగా వృద్ధి చెందుతారు. వర్తక, వ్యాపారాలు పురోగమనంలో నడుస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. అంతర్జాతీయ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అడ్డంకుల నుండి ఉపశమనం పొందుతారు.

Shukra Gochar Malavya Rajayoga these zodiac signs will have royal life soon

సింహరాశి
శుక్రగోచారంతో ఏర్పడే మాలవ్య రాజయోగంతో సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. వర్తక వ్యాపారాలు, ఉద్యోగ వ్యవహారాలు ఎందులో అయినా మీదే పైచేయిగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కన్యారాశి
మాలవ్య రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. గృహ మరియు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా బలోపేతం అవుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు గణనీయమైన లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ బంధం బలపడుతుంది. ఉద్యోగం చేసేవారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందుతారు. అంతకంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది.

తులారాశి
మాలవ్య రాజయోగం వల్ల తులా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మీపై పని ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు దృష్టిసారిస్తారు. వర్తక వ్యాపారాలలో ఉద్యోగాలలో గణనీయమైన ప్రగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలను ఈజీగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మతపరమైన యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

మీనరాశి
మీన రాశి జాతకులకు మాలవ్య రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ వ్యాపారం చేసినా,ఎక్కడ పెట్టుబడులు పెట్టిన మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. స్నేహితులు కుటుంబ పెద్దల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా, ఆర్థిక పరిపుష్టితో బ్రతుకుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+