సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహానికి ఒక ప్రత్యేక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహం. సంపదలు, విలాసాలు, సుఖం, సౌందర్యం, ప్రేమకి శుక్రుడు ప్రతీక. అటువంటి శుక్రుడు 2026 సెప్టెంబర్ 11న శుక్రవారం రాత్రి 11.19గంటలకు శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ గోచారం కొన్ని రాశులవారికి ప్రత్యేక శుభఫలాలు ఇస్తుంది. శుక్రసంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ఒకసారి చూద్దాం.
మేష రాశి:
స్వాతి నక్షత్రంలో శుక్ర సంచారం వల్ల మేషరాశి జాతకులకు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. సెప్టెంబర్ నెలలో అత్యధిక శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం వలన, వ్యాపారాలు మరియు లావాదేవీలు చేసే మేష రాశి వారికి గరిష్ట లాభాలు వస్తాయి. ప్రేమ జీవితంలో కూడా అనుకూల సమయం ఏర్పడవచ్చు. ఇది మేష రాశి జాతకులకు అన్ని విధాలా శుభాలను కలిగించే సమయం.

మిథున రాశి:
స్వాతి నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మిథున రాశి జాతకులు లక్ష్యాలు సాధించడంలో విజయం కలుగవచ్చు. వృత్తి జీవితంలో పురోగతి, ఆర్థికంగా మెరుగైన కాలం కావచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడి, ప్రేమ పెరగవచ్చు. శుభ గ్రహమైన శుక్రుని సంచారం మిథున రాశిలో జన్మించిన వారికి చాలా అదృష్టకరంగా ఉంటుంది. శుక్ర సంచారం సమయంలో మిథున రాశిలో జన్మించిన వారికి ఆర్థిక విషయాలలో కూడా మంచి ఫలితం ఉంటుంది.
కన్య రాశి:
స్వాతి నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కన్యా రాశి జాతకులకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు సాధ్యం అవుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. సమస్యలు తీరి సంతోషకరమైన జీవితం గడపే అవకాశం ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో ఏ రంగంలో పని చేసినా విజయం, ధనసంపద పెరగడం వంటి ఫలితాలు కనిపించవచ్చు. మొత్తంగా కన్యారాశి వారికి ఇది అదృష్ట సమయం. శుక్రుడు రాహువు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేసే వేళ ఈ మూడు రాశులవారు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. అన్నింటా వీరికి కలిసి వస్తుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications