Shukra Mahadasha: 20సంవత్సరాల పాటు శుక్ర మహాదశ.. ఈ దశలో కింగ్ సైజ్ లైఫ్!!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం మన జీవితాలపై అనేక అనుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అయితే గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శుక్రుడు కొందరు వ్యక్తులు జీవితాలకు శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని ఇచ్చి వారికి కింగ్ సైజు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నవగ్రహాల్లో శుక్రుడిని ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు.
ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటారో వారికి దేనికి లోటు ఉండదు. ఎవరి జీవితంలో శుక్ర మహాదశ ఉంటుందో వారు 20 ఏళ్ల పాటు తిరుగులేని జీవితాన్ని అనుభవిస్తారు. అసలు శుక్ర మహాదశ అంటే ఏమిటి? శుక్ర మహాదశ ప్రభావం ఎలా ఉంటుంది? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శుక్రుడు బలమైన స్థానంలో జాతకంలో ఉండడం శుక్ర మహాదశకు సంకేతం. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారు 20 సంవత్సరాల పాటు భోగాలు అనుభవిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. శుక్రుడు సంపదను, లగ్జరీ ని, అందాన్ని, శృంగారాన్ని మరియు సంతోషకరమైన జీవితాన్ని సూచించే గ్రహం.
కుండలిలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే వారి రెండు దశాబ్దాల పాటు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది .సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంపత్య జీవితంలోను అనేక ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే శుక్ర మహాదశ లో కూడా కొన్ని గ్రహాల అంతర్దశలో వల్ల ముఖ్యంగా శని మరియు రాహువు యొక్క అసలు వల్ల ఉపకాలాల ఫలితాలు మారుతూ ఉంటాయి.
దీనివల్ల కొందరికి అనుకూల ఫలితాలు వస్తే మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొందరు జాతకులు శుక్రుడి ఆశీర్వాద మహిమలో సంతోషంగా జీవిస్తే, మరికొందరు సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని ఇబ్బందులను పడాల్సి వస్తుంది. ఇక జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నవారు కొన్ని పరిహారాలను చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.
శుక్ర మహాదశ ప్రభావం వల్ల జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. వారు ఏ పని చేస్తున్నా అన్నింట విజయమే వారికి ఎదురు వస్తుంది. ఊహించని ధన లాభాలు వారికి కలుగుతాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శుక్ర మహాదశని అనుభవించే వారు నిజంగా రాజులు, రాణుల జీవితాన్ని గడుపుతారు. దేనికి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications