రాసిపెట్టుకోండి.. షష్ఠగ్రహ కూటమితో ఈ నెలాఖరు నుండి వీరికి సిరిసంపదల సునామీ!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక, గ్రహాల రాశుల మార్పులు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రాశులలో గ్రహాల కూటములు ఏర్పడి అవి కొన్ని రాశులకు మేలు చేస్తున్నాయి. మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తున్నాయి. అయితే మార్చి నెల చివరలో షష్ఠగ్రహ కూటమి ఏర్పాటు అవుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి.

మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి
ఆరు గ్రహాలు మీనరాశిలో సంయోగం చెంది షష్ఠగ్రహ కూటమిని ఏర్పరుస్తున్నాయి. మార్చి 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కూటమి ఏర్పాటు కాబోతుంది. మీనరాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు సంచరిస్తున్నారు. మార్చి 15వ తేదీ తర్వాత వారితో రవి కూడా జతకడతాడు. ఆపై శని కూడా మీన రాశిలోకి ప్రవేశించడంతో షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

Six planets shashtagraha kutami in Pisces A tsunami of wealth from the end of this month

వృషభ రాశి
షష్ఠగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో పదకొండవ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతున్నందున వృషభ రాశి వారికి సానుకూల ప్రయోజనాలు వస్తాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానంతో బాధపడే వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో వీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది.

తులారాశి
తులా రాశి వారికి షష్ఠ గ్రహ కూటమి అనేక మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి తమ ఆరో స్థానంలో ఆరుగ్రహాల కూటమి ఏర్పడడం వల్ల అంతా మంచే జరుగుతుంది. విదేశాలలో ఉన్న వారికి శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన అంశాలలో అంతా కలిసి వస్తుంది.

మకర రాశి
మకర రాశి వారికి షష్ఠగ్రహ కూటమి అదృష్టాన్నిస్తుంది. మకర రాశిలో మూడవ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల వీరికి రాజయోగం లభించబోతుంది. ఆర్థికపరంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఏ పని చేసినా లక్ష్మీదేవి వరిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా భారీ జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి. వివాహం చేసుకోవాలని భావించే వారికి సంబంధాలు కుదురుతాయి. షష్ఠగ్రహ కూటమి వల్ల చేపట్టే పనులు సానుకూల ఫలితాలను ఇస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+