Solar eclipse2023: ఈ నెలలోనే సూర్యగ్రహణం.. 7రాశుల వారికి ప్రతికూల ప్రభావం; జాగ్రత్త!!
2023 సంవత్సరంలో సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం ఉదయం 7. 04 నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించనప్పటికీ ఈ సూర్యగ్రహణం ప్రభావం మాత్రం వివిధ రాశులపై కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా గ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశి, అశ్విని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ సూర్యగ్రహణం మేషరాశి వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, మొత్తం ఏడు రాశులపై సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావాలను చూపించనుందని తెలుస్తుంది.
మేషరాశి : మేష రాశి పై సూర్యగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్య గ్రహణం నుండి మేషరాశి జాతకులు ప్రధానంగా ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేషరాశి జాతకులలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, మరియు రాహువు కలయిక వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. వీలైనంత వరకు అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించబడింది.

వృషభ రాశి : ఇక వృషభ రాశి జాతకుల పైన కూడా సూర్యగ్రహణం ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది. వృషభ రాశి జాతకులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. విపరీతమైన ఖర్చులను పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ కోసం, ప్రభుత్వ ప్రాజెక్టు కోసం పని చేస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఎడమ కంటికి కానీ కాలికి కానీ గాయం అయ్యే అవకాశం ఉంది.
కన్య రాశి : సూర్యగ్రహణం ప్రభావం కారణంగా కన్య రాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఊహించని వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబంలో అనుకోని సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ఆస్తుల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పెద్దపెద్ద నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకపోవడం మంచిదని సూచించబడింది.
తులా రాశి : తులారాశి జాతకులపై సూర్యగ్రహణం ప్రభావం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపార భాగస్వామ్యంలో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని సూచించబడింది. ఆర్థిక విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి పై సూర్యగ్రహణం కారణంగా ఉద్యోగంలో చిరాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రోజువారి ఆదాయం కూడా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు దెబ్బ తినే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో పై అధికారులతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీనరాశి : మీనరాశిపై సూర్యగ్రహణం ప్రభావం చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో స్థానికులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దపెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మానుకోవాలి. సరైన పెట్టుబడి ప్రణాళిక లేకుండా దేనిని చేయకూడదు. మీరు ఎంత కష్టపడినా ఫలితం నిరాశాజనకంగా వస్తుంది.
మకర రాశి : మకర రాశిపై సూర్యగ్రహణం ప్రభావం చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి, వ్యాపారాలలో కొన్ని ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త భూములను కొనుగోలు చేయడానికి, ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. నిర్మాణ పనులలో నష్టపోయే అవకాశం కూడా ఉంది. హృద్రోగులు అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications