Solar eclipse2023:ఈ నెలలోనే సూర్యగ్రహణం: ఈ రాశుల వారి లక్ మామూలుగా లేదుగా!!

హిందూమతంలోనూ, జ్యోతిష్య శాస్త్రంలోనూ సూర్యగ్రహణాన్ని శుభమైనదిగా పరిగణించరు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను చాలా ముఖ్యమైన సంఘటనలుగా భావిస్తారు. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కనిపించకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అంటారు.

మత విశ్వాసాల ప్రకారం సూర్య గ్రహణమైనా, చంద్రగ్రహణం అయినా మంచివి కావని చెబుతారు. అయితే సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏడు రాశులు ప్రతికూల ఫలితాలను చూడవలసి వస్తే, నాలుగు రాశుల వారికి సూర్యగ్రహణం బ్రహ్మాండంగా లబ్ధిని చేకూరుస్తుంది. వారి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

 daily-horoscope

కర్కాటక రాశి: ఈ సంవత్సరం సూర్య గ్రహణం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రభావంతో కెరీర్లో లాభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో రాణిస్తారు. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి.

కుంభరాశి: సూర్య గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి జాతకులకు ఈసారి చాలా మేలు జరుగుతుంది. కుంభరాశి జాతకులకు సూర్యగ్రహణం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పనిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, పనిచేసే చోట పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఇది కుంభరాశి జాతకులకు అనువైన సమయం. మితిమీరిన ఖర్చులను నియంత్రించి, చక్కని ప్రణాళికతో పనిచేస్తే కుంభరాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను చూడవచ్చు.

మిధున రాశి: సూర్యగ్రహణం ప్రభావం మిధున రాశి జాతకులపై ఉంటుంది. మిధున రాశి జాతకులకు ఈ సూర్యగ్రహణం చాలా మేలు చేస్తుంది. మిధున రాశి జాతకులు గొప్ప విజయాలను సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. వీరి ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. మిధున రాశి జాతకుల జీవితాలలో సంతోషం వెల్లి విరుస్తుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

సింహరాశి: సూర్య గ్రహణ ప్రభావం వల్ల సింహరాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సింహరాశి జాతకులు ఉద్యోగాలలో ప్రమోషన్ పొందడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు సింహరాశి జాతకుల ఇంక్రిమెంట్లకు కూడా ఇది సరైన సమయం అని చెప్పబడింది. వృత్తి, వ్యాపారాలలో గణనీయంగా రాణించటానికి ఈ సమయం కలిసొస్తుందని సూచించబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+