solar eclipse 2023: అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం: ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?
ఏప్రిల్ 20వ తేదీన సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా కనిపించనుంది. ఈ సంవత్సరం సూర్యగ్రహణం వైశాఖ అమావాస్య సందర్భంగా ఏర్పడింది .దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం సిడ్నీలో పాక్షిక సూర్యగ్రహణం గా మధ్యాహ్నం 1. 36 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవచ్చు. కానీ సూర్య గ్రహణం సమయంలో మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
ఈసారి చాలా అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్య గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే గ్రహణం సమయంలో వంట చేయడం, తినడం తప్పనిసరిగా నిషేధించాలి. ఎందుకంటే ఈ సమయంలో వంట చేసినా, తిన్నా అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. సూర్య గ్రహణ సమయంలో నిద్రకు దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎటువంటి పదునైన వస్తువులను ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాదు సరైన సమయంలో సూర్యుడిని నేరుగా కళ్ళతో చూడకుండా జాగ్రత్త తీసుకోండి. ఒకవేళ ఎవరైనా సూర్యుని నేరుగా కళ్ళతో చూడాలని ప్రయత్నిస్తే వారికి శాశ్వత అంధత్వం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సూర్య గ్రహణం నాడు గ్రహణం ప్రారంభమయ్యే ముందు నీళ్ళలో, అలాగే మన ఇంట్లో ఉన్న అన్ని ఆహార పదార్థాలలోనూ గరిక లేదా తులసి ఆకులను వేయాలి. సూర్య గ్రహణ సమయంలో అస్సలు పూజలు చేయకూడదు.
గ్రహణ కాలం తర్వాత ప్రతిదీ శుభ్రం చేసుకున్న తర్వాత పూజలు చేసుకోవాలి. సూర్య గ్రహణం ముగిసిన తర్వాత ప్రజలు స్నానం చేసి కొత్తబట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లంతా గంగాజలం చల్లి శుద్ధి చేసుకోవాలి. సూర్య గ్రహణం సమయంలో ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేయడాన్ని లేదా ఏదైనా శుభకార్యం చేయడాన్ని మానుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications