Solar eclipse: 2024 మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి పంట పండుతుంది!!

ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం చైత్రమాసంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అమావాస్య రోజున ఏర్పడబోతోంది. అమావాస్యనాడు ఏర్పడే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైన గ్రహణంగా చెబుతున్నారు. అయితే ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ధార్మిక పరంగా సూర్యగ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం కారణంగా లబ్ధిని పొందే అదృష్ట రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
సూర్య గ్రహణం కారణంగా మేష రాశి వారికి మేలు జరుగుతుంది. విద్యా రంగంతో సంబంధం ఉన్న మేషరాశి జాతకులకు ఇది ఉత్తమ సమయం. ఈ సమయంలో మేషరాశి జాతకులు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

Solar eclipse: 2024 first solar eclipse in april; these zodiac signs are the lucky!!

మిధున రాశి
ఈ సంవత్సరం అమావాస్య రోజున ఏర్పడే సూర్య గ్రహణం వల్ల మిధున రాశి వారికి శుభాలు చేకూరుతాయి. మిధున రాశి జాతకులు ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. మిధున రాశి జాతకుల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి ఆశించిన మేర ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కూడా లాభసాటిగా ఉంటాయి. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు.

సింహరాశి
ఈ సంవత్సరం తొలి సూర్య గ్రహణం వల్ల సింహరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సింహరాశి జాతకులు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పనిచేసే చోట గౌరవమర్యాదలు లభిస్తాయి. చేసిన పనికి తగిన ఫలితం దక్కుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేయడానికి సింహరాశి వారికి ఇది అనుకూలమైన సమయం. మీరు పెట్టే పెట్టుబడులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

కన్యారాశి
కన్యారాశి వారికి తొలి సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా వీరు బలోపేతం అవుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకున్న పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో నూతన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసేవారు తప్పకుండా ఈ సమయంలో విజయం సాధిస్తారు . విద్యారంగంలో ఉన్న వారు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఆనందం కనిపిస్తుంది.

ధనుస్సురాశి
ధనుస్సు రాశి వారికి తొలి సూర్యగ్రహణం ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక సమస్యల నుండి ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో బయట పడతారు. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఓపికగా పనిచేయడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. పనిచేసే చోట మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు. వ్యాపారంలో గణనీయంగా లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+