Solar eclipse: 2024 మొదటి సూర్యగ్రహణం.. 54సంవత్సరాల తర్వాత; ఈ రాశులవారికి డబ్బువర్షం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య మరియు చంద్రగ్రహణాలు అశుభమైనవిగా పరిగణించబడతాయి. ఈ గ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూతకకాలంలో నియమాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే ఈ సంవత్సరం వచ్చే నెలలో సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ సంవత్సరం సంభవించబోయే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది.
ఏప్రిల్ లో సూర్యగ్రహణం
ఇది 54 సంవత్సరాల తర్వాత సంభవిస్తుంది. ఇది 12 రాశుల వారి పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 2024లో సంభవిస్తున్న మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన సంభవిస్తుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అయినప్పటికీ ఇది ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారి పైన ఈ సూర్యగ్రహణం కనక వర్షం కురిపిస్తుంది.

మేషరాశి
2024లో మొట్టమొదట సూర్యగ్రహణం మేషరాశిలో జన్మించిన వారికి శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకుల ప్రతికల నెరవేరుతుంది. నూతన ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనుకూలమైనదిగా చెబుతారు. పెద్ద మొత్తంలో ఈ సమయంలో మీకు డబ్బు అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత దృఢంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. డబ్బును ఆదా చేయడంలో కూడా ప్రభావంతంగా ప్రవర్తిస్తారు.
వృషభరాశి
2024 మొదటి సూర్యగ్రహణం వృషభ రాశిలో జన్మించిన వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు కెరీర్లో ముందుకు వెళతారు. వీరు మంచిగా డబ్బులు సంపాదించడానికి కూడా అవకాశం ఉంది .పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. రాజకీయాలను చేసేవారు కూడా ఈ సమయంలో మంచి లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన విజయలక్ష్మి వరిస్తుంది. ధనలక్ష్మి ఆర్థిక మద్దతుని ఇస్తుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు 2024లో వస్తున్న మొదటి సూర్యగ్రహణం ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో మీరు పిల్లలకు సంబంధించిన అద్భుతమైన వార్తలను వింటారు. పనిచేసే చోట అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. ఇది మీకు పనిలో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీరు ఏది ప్లాన్ చేసిన విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెండుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, డబ్బు ఆదా చేసే మార్గాల పైన కూడా మీరు ఫోకస్ పెడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications