సూర్యగ్రహణం.. అక్టోబర్ లో ఈ రాశులవారు డబ్బు నష్టపోయే ప్రమాదం.. జాగ్రత్త!!
వేద జ్యోతిష్య శాస్త్రం గ్రహాల గమనం మాత్రమే కాకుండా గ్రహణాల ప్రభావం కూడా అన్ని రాశుల వారి పైన ఉంటుంది అనే విషయాన్ని వెల్లడించింది. ఇక త్వరలో ఏర్పడబోతున్న సూర్యగ్రహణం కొన్ని రాశుల వారి జీవితాల పైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
చివరి సూర్య గ్రహణం.. నష్టపోయే రాశులు
అక్టోబర్ రెండవ తేదీన సంభవించబోతున్న రెండవ మరియు ఈ సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం రోజున సూర్యుడు, బుధుడు, రాహువు, కేతువు అశుభ స్థానాలలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు తలక్రిందులవుతాయి. సూర్యుడు, బుధుడు, కేతువు, రాహువు అశుభ స్థానంలో ఉండడం వల్ల చెడు ఫలితాలు వచ్చే ఆ రాశలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి సూర్యగ్రహణం అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు నష్టాలపాలవుతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కుట్రలకు ఈ సమయంలో బలయ్యే అవకాశం ఉంది.
మిధున రాశి
సూర్యగ్రహణం రోజు గ్రహాలు అశుభ స్థానంలో ఉండడం వల్ల మిధున రాశి జాతకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరి ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. మిధున రాశి వారికి అకస్మాత్తుగా కొన్ని వ్యాధులు వస్తాయి. అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి. మిధున రాశి జాతకులు ఎవరితోనైనా వాగ్వాదానికి వివాదాలకు దిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో గ్యాప్ పెరిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి జాతకులు ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు. ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టకూడదు. రోజువారి పనులను పూర్తి చేయడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతోనూ, పిల్లలతోనూ గొడవలు పడతారు.
వృశ్చిక రాశి
సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ధన నష్టాన్ని చూస్తారు. ఈ సమయంలో నిరాశానిస్పృహలతోటి ఉంటారు. కెరీర్ కి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోకుండా ఉంటే మంచిది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీనరాశి
సూర్యగ్రహణం మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. సరైన నిర్ణయాలను తీసుకోవడం కూడా మీన రాశి వారికి కష్టమవుతుంది. కొత్త పనులు చేయడానికి దూరంగా ఉంటేనే మంచిది. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టపోతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications