దీపావళికి ఈ రాశులవారికి డబ్బుల సంచుల నజరానా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో దీపావళి పండుగ నాడు విశేష యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సారి దీపావళి పండుగకు అరుదైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీ నారాయణ రాజయోగం ధన త్రయోదశి నాడు ఎర్పడుతుండగా దీని ప్రభావం దీపావళి పండుగ నాడు కూడా వివిధ రాశులపై ఉంటుంది. ఇక ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మిధున రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా దీపావళి నాడు మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు సంపదలను పొందుతారు. మిధునరాశిలో వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరుగుతుంది. అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. కెరీర్లో ఊహించని పురోగతి లభిస్తుంది.

సింహరాశి
లక్ష్మీనారాయణ రాజయోగం దీపావళి కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ఆదాయాన్ని పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తులారాశి
లక్ష్మీనారాయణ రాజయోగం దీపావళి కారణంగా తులా రాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు జీవితంలో పురోగతిని చూస్తారు. కెరీర్ లోను అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దీపావళి వీరికి సంపదల వృద్ధిని కలిగిస్తుంది.
వృశ్చిక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు లాభాలు ఇస్తుంది. ఈ సమయంలో వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగం చేసేవారు కూడా పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఈ సమయంలో వీరికి డబ్బుల వర్షం కురుస్తుంది.
కుంభరాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది. వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తండ్రి మద్దతు బాగా లభిస్తుంది. ఎటువంటి కష్టాల నుండైనా ఈ సమయంలో బయటపడతారు. ఈ సమయంలో కుంభరాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇది నిజంగా కుంభరాశి వారికి కలిసొచ్చే కాలం .
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications