త్వరలో వీరికి మహారాజ యోగం.. శాసించిన మాలవ్య మహాపురుష రాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కొన్ని శుభ, అశుభ యోగాలకు కారణమవుతుంది. సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు సంపదలకు, విలాసాలకు, ప్రేమకు అధిపతి. అటువంటి శుక్రుడు తులా రాశిలో సంచారం చేసి మాలవ్య మహా పురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
మాలవ్య మహాపురుష రాజయోగం
ఈ మాలవ్య మహాపురుష రాజయోగం 12 రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏ ఏ రాశుల వారు మాలవ్య మహాపురుష రాజయోగం తో శుభ ఫలితాలను పొందుతారో, ఆకస్మిక ధన ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం.

కన్యారాశి
మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యారాశి వారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కన్యారాశి జాతకులకు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కన్యారాశి జాతకులు మాలవ్య మహా పురుష రాజయోగం కారణంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు.
మకర రాశి
సెప్టెంబర్ లో ఏర్పడే మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నూతన అవకాశాలు వస్తాయి. కెరీర్లో రాణిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి మన్ననలు లభిస్తాయి.
కుంభరాశి
కుంభరాశి వారికి మాలవ్య మహాపురుష రాజయోగం శుభ పరిణామాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఎప్పటినుంచో నెరవేరాలని చూస్తున్న ఆశలు ఈ సమయంలో నెరవేరుతాయి. ఇల్లు, భూములు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం. ఇది అన్ని విధాల కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications