సెప్టెంబర్ మాసంలో విశేష పండుగలు.. ఆధిపత్యం చూపి ఐశ్వర్యాన్ని ఇచ్చే గణపతి!
సెప్టెంబర్ మాసం చాలా ప్రాధాన్యత ఉన్న మాసం. సెప్టెంబర్ మాసంలో హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే అనేక పండుగలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసం హిందూ మతపరంగా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంది. అయితే సెప్టెంబర్ మాసంలో వచ్చే పండుగలు ఏమిటి? సెప్టెంబరులో అన్ని రాశుల వారిని అనుగ్రహించే దేవుడు ఎవరు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెలలో పండుగలు
సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ ఆదివారం మాస శివరాత్రి వచ్చింది. రెండవ తేదీ నేడు పొలాల అమావాస్యను చాలా ఘనంగా జరుపుతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన హర్తాళిక తీజ్ ఉత్సవం జరగబోతుంది. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితిని అత్యంత ఘనంగా హిందువులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన పరివర్తన ఏకాదశి, సెప్టెంబర్ 15వ తేదీన ప్రదోష వ్రతం సెప్టెంబర్ 15వ తేదీన ఓనం కూడా నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ నెలలో ప్రతీరోజూ ప్రత్యేకమే
సెప్టెంబర్ 16వ తేదీన కన్యాసంక్రాంతి, సెప్టెంబర్ 17వ తేదీన అనంత చతుర్దశి, సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద పూర్ణిమ వ్రతం, సెప్టెంబర్ 21వ తేదీన సంకష్టహర చతుర్థి, సెప్టెంబర్ 28వ తేదీన ఇంద్ర ఏకాదశి జరగనుంది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రదోష వ్రతం, సెప్టెంబర్ 30 తేదీన మళ్లీ మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఇక సెప్టెంబర్ మాసంలోని ప్రతి ఒక్క రోజు దేనికదే ప్రత్యేకమైన రోజు.
భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు గణేశ జననం
అన్నిటికంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో గణేశ చతుర్థి దేశవ్యాప్తంగా ప్రజలు విశేషమైన వేడుకగా జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు గణేశుడు జన్మించాడు. విఘ్నాలను తొలగించ గణేషుడు పుట్టినరోజు నాడు వినాయక చవితిని ఘనంగా జరుపుకోవడం ఎంతో కాలంగా వస్తున్న ఆచారం.
సెప్టెంబర్ మాసంలో అందరినీ అనుగ్రహించే వినాయకుడు
గణేష్ చతుర్థి అనంత చతుర్దశి మధ్య కాలంలో వినాయకుడు తన భక్తులు ఇళ్లకు వెళ్లి వారందరి పైన తన కటాక్షాన్ని ప్రసరింప చేస్తాడని చాలామంది నమ్ముతారు. ఇక సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా అన్ని రాశుల వారి పైన గణేశుడు తన కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. వినాయకుని ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు












Click it and Unblock the Notifications