శ్రీ కృష్ణాష్టమి.. పూజలో ఇవి పెడితే నల్లనయ్య కటాక్షం, మీ ఇంట సంతోషం!
హిందువులు అత్యంత ఇష్టంగా పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి . రేపు శ్రీ కృష్ణ జయంతి పర్వదినం. ప్రతీ ఇంట గోపబాలురు సందడి చేసే దినం. క్రిష్ణయ్యను భక్తులు శ్రద్ధతో పూజించే పర్వదినం నేడు. కృష్ణుడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు అని చెబుతారు. ఈరోజు శ్రీకృష్ణుడికి అత్యంత భక్తి భావంతో పూజలు చేసి కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు.
రేపే శ్రీ కృష్ణాష్టమి
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్నే గోకులాష్టమి, కృష్ణాష్టమి, కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా చెబుతారు. రేపు ఉదయం 3.39 నిమిషాలకు అష్టమి తిధి ప్రారంభమై ఆగస్టు 27వ తేదీన తెల్లవారుజామున 2 గంటల 19 నిమిషాలకు అష్టమి తిధి ముగుస్తుంది. ఇక ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 55నిమిషాలకు రోహిణి నక్షత్రం ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషాలకు ముగుస్తుంది.

శ్రీకృష్ణ భగవానుడి 5251 వ జయంతి
ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి ఎంతో పవిత్రమైన రోజు శ్రీకృష్ణ భగవానుడు 5251 వ జయంతిని జరుపుకుంటున్నాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చాలా మంది శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంలో భాగంగా ఉపవాస దీక్షను చేస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణ పరమాత్మను పూజించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాటితోనే ఆయనకు పూజలు నిర్వహించాలి.
కృష్ణుడికి పూజలో ఇవి సమర్పించండి
శ్రీకృష్ణుని పూజలో తులసి ఆకులు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారం కాబట్టి తులసి ఆకులు లేని నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడని చెబుతారు. ఈ క్రమంలోనే ముందు రోజే తులసి ఆకులను తుంచుకొని శ్రీకృష్ణాష్టమి రోజున భగవంతుడికి తులసాకులను సమర్పించాలి. కృష్ణాష్టమి రోజున వెన్న, పంచదార తో తయారు చేసిన స్వీట్లు కృష్ణుడికి సమర్పించాలి వెన్న, మిఠాయిలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి ఆయనకు వీటిని సమర్పించాలి.
కృష్ణుడికి ఇవి తప్పనిసరి
నెమలీకలతో కృష్ణుడిని అలంకరించాలి. పూజ సమయంలో కిరీటంలో నెమలీకలను పెట్టి పూజిస్తే కృష్ణుడు సంతోషిస్తాడు. శ్రీకృష్ణుని పూజించేటప్పుడు పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంతే కాదు కృష్ణుడికి గంగాజలంతో తప్పనిసరిగా అభిషేకం చేయాలి. కృష్ణాష్టమి రోజు చేసే పూజలలో ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కృష్ణాష్టమి రోజు పూజలు చేస్తే కృష్ణుడి కటాక్షం తప్పనిసరిగా మనపైన ఉంటుంది.












Click it and Unblock the Notifications