శ్రీ రామ నవమి 2024.. ఈ 5 రాశులవారికి దశ తిరిగినట్టే

ఈ సంవత్సరం శ్రీరామనవమి చాలా స్పెషల్. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం 9వరోజున శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి రోజున శ్రీరాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో అరుదైన యాదృచ్ఛిక సంఘటన జరగబోతోంది. ఇదే రోజున గజకేసరి యోగం కూడా కొన్ని రాశుల వారికి కష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
శ్రీరామనవమి మేష రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మేష రాశి జాతకులు తమ ఆర్థిక అడ్డంకులను అధిగమించడంలో విజయాన్ని సాధిస్తారు. మేష రాశి వారు ఊహించని విధంగా పూర్వీకుల ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కారమవుతాయి. భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారిపై రాముడి దయ తప్పకుండా ఉంటుంది.

Sri Rama Navami 2024 good fortune for these 5 zodiac signs
కర్కాటక రాశి
శ్రీరామనవమి రోజున కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ భవిష్యత్తు ప్రణాళికలను నేపథ్యంలో ప్రయోజనాలను పొందడానికి మీకు అనేక అవకాశాలు దొరుకుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తులారాశి
తులా రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వాహనం లేదా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు డబ్బులు ఎవరికైనా విరాళంగా ఇస్తే అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మీకు లబ్ధిని కలిగిస్తుంది. మీ కెరీర్ ను మెరుగుపరుచుకోవడానికి కూడా గొప్ప అవకాశాలను పొందే వీలుంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు శ్రీరామనవమి శుభాలను చేకూరుస్తుంది. మీ కెరీర్ లో పురోగతి సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థికంగానూ ఈ సమయంలో అభివృద్ధి సాధిస్తారు. ధార్మిక ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ నెరవేరతాయి.

మీన రాశి
మీన రాశి వారికి శ్రీరామనవమి అనుకూలమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి వాతావరణం ఉల్లాసంగా మరియు ఆనందంతో కూడి ఉంటుంది. మీరు ఈ కాలంలో డబ్బులు పెట్టుబడి పెడితే కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ సామరస్యంగా జీవించే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+