Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం!

హిందూ పంచాంగం ప్రకారం, మార్చి 27వ తేదీన శ్రీరామనవమిగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ శ్రీరామనవమి పర్వదినాన కొన్ని శుభప్రదమైన యోగాలు ఏర్పడనున్నాయి. అంతకు ముందే మార్చి 26న సంపదకు అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా, గ్రహాలరాజు గురువు, చంద్రుడి కలయికతో గజకేసరియోగం, గురువు, కుజుల ప్రభావంతో నవపంచమరాజయోగం ఏర్పడుతున్నాయి.ఈ రాజయోగాలతో ఏయే రాశుల వారికి ఈ యోగాలు అదృష్టాన్ని తెస్తాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి శ్రీరామనవమి విశేష శుభాలను తీసుకొస్తుంది. ఈరోజు మేష రాశి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా, సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో వారి కృషికి ప్రశంసలు దక్కుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది, జీవిత భాగస్వామితో బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Sri Rama Navami gajakesari and navpancham rajyoga gives wealth and good fortune to these zodiacs

వృషభ రాశి

వృషభ రాశి వారికి శ్రీరామనవమి అత్యంత శుభప్రదంగా, లాభదాయకంగా మారుతుంది. శ్రీరామనవమి నాడు ఏర్పడే శుభ యోగాల కారణంగా ఊహించని ధన లాభాలను పొందే బలమైన అవకాశాలున్నాయి. ఆర్థిక స్థితి గణనీయంగా బలోపేతం అవుతుంది. పుణ్యక్షేత్రాలకు యాత్ర చేయడం ద్వారా మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇల్లు, భూమి లేదా ఆస్తి, కొత్త వాహనం కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం.

కన్య రాశి

కన్య రాశి వారికి శ్రీరామనవమి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అద్భుత అవకాశం లభిస్తుంది. మీ ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది. వైవాహిక సంబంధాలు సామరస్యంగా సాగి, మీ బంధువులతో ఆత్మీయ సంభాషణలు ఆనందాన్నిస్తాయి. ఈ సమయంలో ఒక విలువైన బహుమతిని అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరే సూచనలున్నాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శ్రీరామనవమి సానుకూల ఫలితాలను ఇస్తుంది . ఈ కాలంలో మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంతో కొన్ని ప్రత్యేకమైన, క్షణాలను గడుపుతారు. వ్యాపారులకు గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధిత వ్యాపారాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!

కుంభ రాశి

కుంభ రాశి వారికి శ్రీరామనవమి అత్యంత శుభప్రదంగా మారుతుంది. ఈ కాలం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబంలోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితం సుఖమయంగా, సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు చేకూరతాయి. మీ తోబుట్టువుల నుండి శుభవార్తలు వింటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+