సూర్యుడు, బృహస్పతి సంయోగం: నేటినుండి నెలరోజులపాటు మూడు రాశులవారికి ధనలాభం!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోక గ్రహాలు సంచారం చేయడం, అలాగే గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు సంయోగం చెందడం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు మీనరాశి నుండి మేష రాశికి ప్రయాణం చేస్తున్నాడు. ఏప్రిల్ 13వ తేదీ అంటే నేటి రాత్రి 8 గంటల 51 నిమిషాలకు సూర్యుడు మేషరాశిలో కి వెళ్తాడు.
సూర్య బృహస్పతి సంయోగం.. నేటినుండి వీరికి ధనలాభం
ఇక అప్పటికే అక్కడ బృహస్పతి ఉన్న కారణంగా, సూర్య బృహస్పతిల కలయిక జరుగుతుంది. ఈ సంయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి ల సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుంది. వారు ఊహించని అదృష్టాన్ని పొందుతారు.

మేషరాశి
మేషరాశిలో సూర్యుడు బృహస్పతి సంయోగం వల్ల మేష రాశి జాతకులకు అదృష్ట రాబోతుంది. మేష రాశి జాతకుల కెరీర్ ఈ సమయంలో చాలా బాగుంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో వీరికి ధనలాభం కలుగుతుంది. నేటి నుంచి సరిగ్గా నెలరోజుల పాటు మేషరాశి జాతకులకు అన్ని విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది. మేషరాశి జాతకుల ప్రేమ జీవితం కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది.
మిధున రాశి
సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల మిధున రాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. మిధున రాశి జాతకులు ఉద్యోగ జీవితంలో కొత్త నైపుణ్యాలను, వారి ఉద్యోగ జీవితంలో పురోగతిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో సానుకూలమైన సంబంధాలను కలిగి ఉంటారు. సంతోషంగా జీవిస్తారు.
సింహరాశి
సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల సింహ రాశి జాతకులకు నెల రోజులపాటు అదృష్టం తోడుగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి పని సాధ్యమవుతుంది. ఈ సమయంలో సింహరాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ నెల రోజుల కాలం శుభాలను చేకూరుస్తుంది. .
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications