పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారం!
2026 ఆగస్టు 31న ఉదయం 4:04 గంటలకు సూర్యుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో సూర్యుడు సింహ రాశిలోనే ఉంటాడు. పూర్వ ఫల్గుణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యం, కళలు, ప్రేమ, సౌకర్యాలకు కారకుడు కాబట్టి ఈ సంచారం కొన్ని రాశులవారికి ధనం, వృత్తి, యశస్సు, సామాజిక గౌరవంలో శుభ పరిణామాలు తెచ్చే అవకాశం ఉంది.
మేష రాశి: సూర్యుడు మేషరాశిలో 5వ భావంలో సంచారం చేయటం మేషరాశి వారికి కలిసి వస్తుంది. విద్య, బుద్ధి, సృజనాత్మకత, ప్రేమ జీవితం మెరుగవుతాయి. మీడియా, విద్య, మేనేజ్‌మెంట్ రంగాల్లో అవకాశాలు రావచ్చు. ప్రతిరోజూ ఉదయం రాగి పాత్రలో నీరు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి.

మకర రాశి: సూర్యుడు మకరరాశిలో 8వ భావంలో సంచరిస్తాడు. దీంతో ఆగస్ట్ 31 నుండి మకర రాశి వారి ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చు. అయినా పూర్వ ఫల్గుణి ప్రభావంతో వారసత్వ ఆస్తి, పెట్టుబడులు, పాత సమస్యలు పరిష్కారం కావచ్చు. భీమా, పన్నులు, పితృస్వత్తు సంబంధిత పనుల్లో లాభం ఉంటుంది. పత్రాలు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి ఆదివారం రాగి వస్తువు దానం చేస్తే మంచి జరుగుతుంది.
సింహ రాశి: సూర్యుడు సింహరాశిలో స్వగృహంలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు బలపడతాయి. సమాజంలో ప్రభావం, గౌరవం పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త అవకాశాలు రావచ్చు. అహంకారం పెరగకుండా జాగ్రత్త. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి.
తులా రాశి: సూర్యుడు 11వ భావంలో తులారాశిలో సంచారం చేస్తాడు. ఆదాయం, లాభాలు, స్నేహితులు, సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు, పాత స్నేహితుల ద్వారా లాభాలు రావచ్చు. ఆదివారం గోధుమలు, బెల్లం దానం చేయండి.
ధనుస్సు రాశి: సూర్యుడు ధనుస్సు రాశిలో 9వ భావంలో సంచారం చేయటం కారణంగా అదృష్టం, ఆధ్యాత్మికత, ఉన్నత విద్య, తండ్రి మద్దతు పెరుగుతాయి. ప్రయాణాలు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో లాభం ఉంటుంది. ఆదివారం సూర్యుడికి జలార్పణ చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications