కుంభరాశిలో సూర్యుడు.. ఈ రాశులకు ఆకస్మిక ధనయోగం
ఈనెల 14 నుంచి వచ్చే నెల 15 వరకు సూర్యుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీనివల్ల ఆరు రాశులవారికి అధికార యోగం పడుతుంది. సామాజికంగా మంచి పరిచయాలను కలిగివుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆ ఆరు రాశులవారు మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం. వీరికి ఆర్థికంగా లాభం కలగడంతోపాటు ఆస్తికి సంబంధించిన యోగాలు కూడా ఉన్నాయి.
మేష రాశి
ఆదాయం పెరుగుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. పరిచయాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పురోగతి ఉంది.

వృషభ రాశి
ఈ రాశికి దశమ స్థానంలో సూర్యుడి సంచారంవల్ల దిగ్బలం ఏర్పడుతుంది. అధికార యోగం పట్టడంతోపాటు వీరి సలహాలు, సూచనలతో పనిచేసే కంపెనీ అభివృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు పెరుగుతాయి. తండ్రి నుంచి ఆస్తి వస్తుంది.
మిథున రాశి
విదేశీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు, ప్రత్యర్థులు వెనకడుగు వేస్తారు. రాజకీయంగా మంచి ప్రాధాన్యం కలుగుతుంది.
తులా రాశి
వీరి ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ధనార్జనకు మార్గాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. శుభపరిణాలు చోటుచేసుకోనున్నాయి.
ధనుస్సు రాశి
చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఎంతటి పనినైనా సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా మారతాయి. ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.
మకర రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఆర్థికంగా లాభపడతారు. ఆస్తుల విలువ పెరగడంతోపాటు రావల్సిన డబ్బు చేతికి అందుతుంది. మాటలకు, చేతలకు విలువ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications