నవంబర్ 16వరకు వీరు బంగారం ముట్టుకున్నా మట్టే.. హెచ్చరించిన సూర్యుడు!
గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రతి నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ప్రస్తుతం సూర్యుడు శత్రువుకి చెందిన రాశి అయిన తులా రాశిలో ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. నవరాత్రుల తర్వాత తన రాశిని మార్చుకున్న సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన తులారాశిలోకి సంచారం ప్రారంభించాడు.
సూర్యసంచారంతో కష్టాలు, నష్టాలు
సూర్యుడు నవంబర్ 15వ తేదీ వరకు తులా రాశిలో ఉండి ఆపై నవంబర్ 16వ తేదీ ఉదయం 7 గంటల 41 నిమిషాలకు వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. అయితే శత్రువు రాశిలోకి సూర్యసంచారం కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టాలను, కష్టాలను కలిగిస్తుంది. నవంబర్ 16 వరకు సూర్య సంచారం కారణంగా కష్టాలను ఎదుర్కొనే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
తులారాశిలో సూర్యసంచారం కారణంగా మేషరాశి జాతకులు ధనలాభాలను పొందినా ప్రతికూల ఫలితాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరి ప్రేమ సంబందానికి కొంత ఆటంకం కలుగుతుంది. ఇది మేష రాశి వారి మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. మేషరాశి జాతకులు వారి జీవిత భాగస్వామితో ఘర్షణ పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఓపికతో ఉండాలి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఆరోగ్యం పైన దృష్టిని కేంద్రీకరించాలి. మానసికంగా, శరీరకంగా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉన్నందున ధ్యానం, యోగ వంటివి చెయ్యాలని సూచించబడింది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో షేర్లలో డబ్బులు పెట్టుబడి పెడితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
తులారాశి
సూర్య సంచారంతో తులా రాశి వారికి కొంత అదృష్టం కలిసొచ్చినా, కొన్ని ప్రతికూల పరిస్థితులను కలిగించవచ్చు. తులా రాశి వారి ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. శారీరకంగానూ, మానసికంగానూ అలసిపోయినట్టు అనిపించవచ్చు. ఈ సమయంలో తులా రాశి జాతకులు సహనంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల కారణంగా జీవిత భాగస్వామితో గొడవలకు దిగే అవకాశం ఉంది.మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు వాదనలకు దిగకుండా సంయమనం పాటించాలని సూచించబడింది.
మీన రాశి
మీన రాశి వారికి సూర్య సంచారం కారణంగా నిరుత్సాహంగా ఉంటుంది. వీరు తమ నిరుత్సాహాన్ని నివారించడానికి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి. ఈ సమయంలో మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. ఒకవేళ దేనిలోనైనా పెట్టుబడులు పెడితే తర్వాత చింతించాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications