సూర్య రాహు సంయోగం.. ఇది వీరికి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అనేక శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తున్నప్పుడు ఏర్పరిచే యోగాలు కొన్ని రాశులవారికి మంచి ఫలితాలను ఇస్తే, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుతం జూన్ మాసంలో వివిధగ్రహాలు ఒకదానికొకటి కలిసి వివిధ యోగాలను ఏర్పరుస్తున్నాయి. నిర్దిష్టమైన ఖగోళ సంఘటనలు జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన పరిణామాలను ఏర్పరుస్తూ అనేక మార్పులకు కారణమవుతున్నాయి.

జూన్ లో సూర్య రాహు సంయోగం
2025 జూన్ లో సూర్యుడు మరియు రాహువు కలయిక ఒక నిర్దిష్టమైన ఖగోళ సంఘటనగా చెప్పబడుతుంది. జూన్ 16వ తేదీన కుంభరాశిలో సూర్యుడు రాహువు కలయిక జరగనుంది ఇదే సమయంలో చంద్రుడు కూడా రాహువుతో కలిసి గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తారు. సూర్యుడు రాహువు కలయికను గ్రహణ యోగం లేదా సూర్య రాహు సంయోగం అని పిలుస్తారు. ఇక ఈ కలయిక ఎవరికి వారికి వ్యక్తిగత జాతకాలపైన ఆధారపడి ఉంటుంది.

Sun-Rahu conjunction This is the time to be careful for these zodiac signs

సూర్య రాహు సంయోగంతో ప్రపంచంపై ప్రభావం
గ్రహణ యోగం లేదా సూర్య రాహు సంయోగం సాధారణంగా ప్రపంచం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా రాహువును నీడ గ్రహంగా, కీడు చేసే గ్రహంగా పిలుస్తారు. ఇది మనకు అశాంతికి, అస్పష్టతకు కారణంగా కనబడుతుంది.సూర్యుడిని ఆత్మకు, వ్యక్తిత్వానికి, అధికారానికి ప్రతీకగా భావించే గ్రహంగా సూచిస్తారు. ఇక రాహువు మరియు సూర్యుల కలయిక కొన్నిసార్లు అవాంఛనీయమైన ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది.

చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
2025 జూన్ మాసంలో ఈ కలయిక యొక్క ప్రత్యేక ప్రభావాలు ఆయా రాశుల వారి వ్యక్తిగత జాతకాలపైన ఆధారపడి ఉంటాయని చెప్పడం నిర్వివాదాంశం. సాధారణంగా ఈ సమయంలో ద్వాదశ రాశుల వారు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. రాహువుతో సూర్యుని కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కలయిక ఏమాత్రం మంచిది కాదనే చెప్పాలి.

కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు
ఇది ఒత్తిడి ఆందోళన మరియు అస్పష్టతకు దారితీస్తుంది. ఈ సమయంలో జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రతికూల ప్రభావాలు రావడంతో పాటు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ కలయిక ఊహించని మంచి అవకాశాలను కూడా తెచ్చే పరిస్థితి ఉంది. కనుక ఈ సమయంలో ధైర్యంగా, చురుకుగా ఉంటే కొన్ని రాశుల వారు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+